అమెరికాలో గన్ పేలి హైద్రాబాద్ యువకుడు మృతి
Publish Date:Nov 22, 2024
Advertisement
హైద్రాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ రెడ్డి అమెరికాలో గన్ ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆర్యన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి ఉంది. ఎంఎస్ చదవడానికి ఆర్యన్ రెడ్డి గత సంవత్సరం అమెరికా వెళ్లాడు . లైసెన్స్ హంటింగ్ గన్ శుభ్ర పరుస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చదువుకోవడానికి వెళ్లిన ఆర్యన్ రెడ్డి లైసెన్స్ గన్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. నవంబర్ 13న ఆర్యన్ రెడ్డి బర్త్ డే. ఆ రోజు కాలేజికి వెళ్లకుండా తన గదిలోనే ఆర్యన్ రెడ్డి మృతి చెందాడు ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 23 ఏళ్ల ఆర్యన్ రెడ్డికి వేటాడటం హాబీ అని తల్లి దండ్రులు చెబుతున్నారు. శుక్రవారం సాయంతం(నవంబర్ 22) ఆర్యన్ రెడ్డి డెడ్ బాడీ హైద్రాబాద్ చేరుకోనుంది. పది రోజుల క్రితం చనిపోయినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికా పోలీసులు తల్లి దండ్రులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
http://www.teluguone.com/news/content/hyderabad-youth-dies-after-gun-explodes-in-america-39-188789.html





