వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కద్దు.. యూట్యూబర్లకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Publish Date:Oct 16, 2025

Advertisement

యూట్యూబర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యూస్ కోసం చిన్నారుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి వీడియోలు చేస్తే సహించేది లేదని హచ్చరించారు.  ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వ్యూస్, లైక్ లతో పాటు సోషల్ మీడియాలో  ఫేమస్ అవ్వడానికి చిన్నారుల భవిష్య త్తును పణంగా పెట్టడం  సమంజసం కాదంటూ పోస్టు చేశారు. చిన్నారులతో  అసభ్యకర మైన కంటెంట్ చేస్తూ సభ్య సమా జానికి  ఏం సందేశం ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చిన్నారులకు, యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మరియు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయాలంటూ హితబోధ చేశారు. అందుకు భిన్నంగా  చిన్నారులతో అసభ్య కంటెంట్ వీడియోలు చేసి..  వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి చిన్నారు ల  యువతను పెడ దోవ పట్టించొద్దని హెచ్చరించారు. .  అటువంటి వీడియోలు  బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, చట్ట రీత్యా నేరం కూడా అని పేర్కొన్న ఆయన ఇటువంటివి  పోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘన కిందకే వస్తాయన్నారు.

మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సజ్జనార్ హెచ్చరించారు. అటువంటి వారిపై తక్షణమే వీటిని తొలగించకుంటే..  లేదంటే  కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్  ఇచ్చారు. అలాగే భవిష్యత్ లో ఎవరైనా సరే ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.

సోషల్ మీడియాలో ఇలాంటి వీడి యోలపై  స్థానిక పోలీసులతో సమాచారాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోస్టల్ cyber crime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు.   పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచి..  సానుకూల వాతావరణం కల్పించి సరైన పద్ధతిలో విలువలను నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు.

By
en-us Political News

  
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్ట‌ప్ ఇండియా, అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్ వంటి ప‌థ‌కాలు యువ పారిశ్రామిక వేత్త‌ల‌కు గొప్ప అవ‌కాశాల‌కు రాచ‌బాట ప‌రుస్తున్నాయి. నేడు భార‌త్ లో 1. 25 ల‌క్ష‌ల‌కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట‌ప్స్ ఉన్నాయి. ఇందులో స‌గానికి పైగా టూ టైర్ 2, 3 ప‌ట్ట‌ణాల నుంచి మొద‌లైన‌వి కావ‌డం విశేషం.
ఈ ట్రయల్ లో భాగంగా  ప్రజల ఫోన్లకు శనివారం  అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నిస్సంక పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.