హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో భారీ మార్పులు.!

Publish Date:Oct 1, 2026

Advertisement

హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలోని జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను ప్రభుత్వం పునర్విభజించింది. మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పరిధుల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేశారు. ముఖ్యంగా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోకి మార్చారు. శంషాబాద్‌, మహేశ్వరం, సైబరాబాద్‌ పరిధుల్లోనూ కీలక మార్పులు చేశారు. శంషాబాద్‌ డివిజన్‌లోని పోలీస్‌స్టేషన్ల పరిధులను సైతం పునర్వ్యవస్థీకరించారు. 

ఇందులో భాగంగా ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పేరును శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌జీఐఏ, శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.ఇక రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాలను ఇతర పోలీస్‌స్టేషన్ల పరిధుల్లోకి మార్చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌, మీర్‌పేట్‌ ప్రాంతాల్లోనూ పోలీస్‌ పరిధులను పునర్విభజించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌ పరిధుల్లోనూ పోలీస్‌స్టేషన్ల సరిహద్దులను సవరించారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా పరిధులను మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సాధారణ పోలీస్‌స్టేషన్లకే పరిమితం కాకుండా ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగంలోనూ జోన్లు, డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. మహిళల భద్రతకు సంబంధించిన వుమెన్‌ సేఫ్టీ వింగ్‌ పరిధిలోనూ కొత్తగా జోన్లను కేటాయించారు.అదేవిధంగా పెరుగుతున్న సైబర్‌ నేరాలను దృష్టిలో ఉంచుకుని జోనల్‌ సైబర్‌ సెల్‌ పరిధులను కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మొత్తంగా నగర పోలీస్‌ వ్యవస్థలోని వివిధ విభాగాలు, జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం G.O.Ms.No.84 జారీ చేసింది. తాజా పునర్వ్యవస్థీకరణతో పోలీస్‌ పరిపాలనను మరింత సులభతరం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు మార్గం సుగమం కానుంది.

 

 

[ Hyderabad Police Commissionerate, .Shamshabad, Maheshwaram, Cyberabad, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.