వివాదాస్పదమౌతున్న బీఆర్ఎస్ ఫేస్ బుక్

Publish Date:Apr 15, 2023

Advertisement

హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం. ప్రపంచంలో ఎక్కడ మతకలహాలు జరిగినా దాని ప్రభావం హైదరాబాద్ నగరంపై పడుతుంది. భారతీయ జనతాపార్టీ, సంఘ్ పరివార్ హైదరాబాద్ ను భాగ్యనగరం అని సంభోధిస్తుంటాయి. సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ వాదులు హైదరాబాద్ ను భాగ్యనగరం అని పిలవడాన్ని ఖండిస్తున్నారు. అయితే ప్ర స్తుతం   భారతీయ జనతా పార్టీ సరసన బీఆర్ ఎస్ చేరినట్టే కనబడుతుంది. హిందూ వోటర్లను ఆకర్షించడానికి బీఆర్ఎస్ హైద్రాబాద్ ను తమ ఫేస్ బుక్ లో  భాగ్యనగరం అని రాసుకొచ్చింది. మజ్లి స్ పార్టీతో చెట్ట పట్టాల్ వేసుకుని తిరిగే బీఆర్ఎస్ భాగ్యనగరం అనే పల్లవి ఎత్తుకోవడాన్ని చాలామంది నిరసిస్తున్నారు.

మజ్లిస్  బచావో తహరీక్ నేత అమ్జదుల్లా ఖాన్ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. బీజేపీ బాటలో బీఆర్ఎస్ వెళుతుందని దుయ్యబట్టారు.హిందూ వోటర్లను ఆకర్షించడానికి ఈ విధంగా ప్రచారం చేస్తుందన్నారు.  బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా బీఆర్ఎస్ తన సోషల్ మీడియా అకౌంట్లో హైదరాబాద్ ను భాగ్యనగరం అని సంభోధించడం విడ్డూరమన్నారు. హైదరాబాద్ ను భాగ్యనగరం అని చరిత్ర పుటల్లో కూడా లేదని లౌకికవాదులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.