హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రగడ...గులాబీ పార్టీ వైఖరింటో?

Publish Date:Apr 19, 2025

Advertisement

 

రాష్ట్రంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల బరిలో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం ఉన్నాయి. ఈ ఎలక్షన్‌లో మజ్లిస్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కావడం కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్ జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీ విప్ ధిక్కరిస్తే వేటు తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ వద్దు ఎంఐఎం వద్దని ఇరు పార్టీలకు సమదూరం పాటించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈనెల 24వ తేదీన ఎమ్మెల్సీ ఓటింగ్‌కు అందరూ దూరంగా ఉండాలని పార్టీ నేతలకు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావును ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు కాంగ్రెస్ ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.  

బీజేపీకి గెలిచే అంతా బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ మద్దతిస్తాయనేది చూసిన తర్వాత కమలం పార్టీ ఓ నయా ప్లాన్ రూపొందించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే ,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. బీఆర్ఎస్‌కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 14 ఓట్లు ఉన్నాయి.  ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపుకు ముందు గానే ఖారారైనట్లు తెలుస్తోంది.  క్రాస్ ఓటింగ్‌పై కాషాయ పార్టీ హోప్స్ పెట్టుకుంది. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని ఆరోపిస్తున్నారు.

 

 

By
en-us Political News

  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.