గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ గుట్టురట్టు!

Publish Date:Jun 26, 2026

Advertisement

 

సోషల్ మీడియా వేదికగా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ, హల్ చల్ చేసిన హైదరాబాద్‌ గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అసలు రంగు ఎట్టకేలకు బయటపడింది. తక్కువ ధరకే లగ్జరీ గోల్డ్ ఇప్పిస్తానంటూ నమ్మించి, అమాయకులను ముంచేస్తున్న పి. సురేశ్ కుమార్ అలియాస్ సూర్య భాయ్‌పై హైదరాబాద్ నగర పోలీసులు చీటింగ్ కేసులు నమోదు చేశారు.

అత్తాపూర్ ప్రాంతంలో నివసించే 34 ఏళ్ల సురేశ్ కుమార్, ఒంటి నిండా కిలోల కొద్దీ నకిలీ ఆభరణాలు వేసుకుని తిరుగుతుంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తనకు అత్యంత ఆప్తులని ప్రచారం చేసుకున్నాడు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అచ్చమైన బంగారాన్ని అందిస్తానని పలువురిని నమ్మించాడు.

ఈ క్రమంలోనే ఓ బాధితుడి నుంచి ఏకంగా రూ.32 లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత మొహం చాటేశాడు. బాధితులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో.. తప్పించుకోవడానికి మూడు ఐఫోన్లు, రూ.20 లక్షల విలువైన చెక్కు ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత తన పరపతిని ఉపయోగించి బాధితులను బెదిరించి, ఇచ్చిన ఫోన్లను సైతం బలవంతంగా లాక్కున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మొదట ఈ ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, కేసు తీవ్రత దృష్ట్యా దీనిని తదుపరి దర్యాప్తు కోసం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అంతేకాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేసినందుకు సూర్య భాయ్‌పై మరో అదనపు కేసు కూడా నమోదైంది.

గతంలోనే ఈ 'గోల్డ్ మ్యాన్' ఆర్భాటాలపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆరా తీశారు. తాను ధరించే నగలు రూ.కోటి విలువైనవని సూర్య భాయ్ చెప్పుకోగా, ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అవి చౌకబారు లోహాలతో చేసిన నకిలీవని తేలింది. వాటి అసలు విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని నిర్ధారణ కావడం గమనార్హం.

ఈ నకిలీ గోల్డ్ మ్యాన్ ఉచ్చులో పడి ఇంకా ఎవరైనా మోసపోయారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియా పాపులారిటీని చూసి ప్రజలు మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.

By
en-us Political News

  
వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి
విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం
తుంగభద్ర డ్యామ్ ఆధునీకరణ మరియు పునర్నిర్మాణ పనుల పూర్తి సందర్భంగా కర్ణాటకలో నిర్వహించిన సభ
దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య మరియు పొరుగున ఉన్న కర్ణాకటతో నదీ జలాల పంపకాల వ్యవహారం
అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన కడప బిడ్డ...
హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్‌లో మహిళలకు లైంగిక వేధింపులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోంది, కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన
సంచలన కేసుగా మారిన పుణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను భారీ రాబడుల పేరుతో ఆకర్షించి మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.