హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. కూకట్‌పల్లిలో మూడు కంపెనీలు దగ్ధం.!

Publish Date:Nov 8, 2026

Advertisement

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశ్బెస్టాస్ కాలనీలో పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట ఒక కంపెనీలో ప్రారంభమైన మంటలు క్రమంగా తీవ్రరూపం దాల్చి పక్కనే ఉన్న గోదాములు, ఇతర కంపెనీలకు వ్యాపించాయి. ఈ క్రమంలో జీఆర్‌బీ నెయ్యి (GRB Ghee), హల్దీరామ్‌కు సంబంధించిన గోదాముల్లోకి కూడా మంటలు వ్యాపించాయి.

మంటల తీవ్రతకు మూడు కంపెనీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదంలో నాలుగు టాటా ఏస్ వాహనాలు సైతం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు పొగ కారణంగా ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు పక్కనే ఉన్న గోదాములకు కూడా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై కూకట్‌పల్లి ఫైర్ ఆఫీసర్ జగన్ మోహన్ మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంతో పాటు అగ్నిప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.

మైలార్‌దేవ్‌పల్లిలో నాలుగు గంటల్లో రెండు భారీ అగ్నిప్రమాదాలు.!

మరోవైపు, హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలోనూ వరుస అగ్నిప్రమాదాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఓ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ దుకాణాలకు వ్యాపించగా.. మరోవైపు ఊడంగడ్డ వద్ద ఉన్న గోదాంలోనూ భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అవి తీవ్రరూపం దాల్చి పక్కనే ఉన్న ప్లైవుడ్ దుకాణాలకు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. 

మంటల తీవ్రతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ఊడంగడ్డ వద్ద మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇళ్ల మధ్యలో ఉన్న ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికీలలు ఆకాశాన్నంటాయి. దట్టమైన నల్లటి పొగ చుట్టుపక్కల కాలనీలను కమ్మేసింది. 

పొగ తీవ్రతకు స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు రోడ్లపైకి చేరుకుని భయాందోళనతో పరిస్థితిని గమనించారు.రెండో అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. 

కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు జరగడంతో మైలార్‌దేవ్‌పల్లి వాసులు ఆందోళన చెందుతున్నారు. నివాసాల మధ్యలో గోదాంలు ఉండటంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ మూడు అగ్నిప్రమాదాలకు గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనలపై పోలీసులు, సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: దీపావళి వేడుకల్లో అపశ్రుతి.. బాణసంచా కాల్చుతూ 15 మందికి కంటి గాయాలు.!

 

[ Hyderabad Fire Accident, Kukatpally Fire, Mylardevpally Fire Accident, Massive Fire, Asbestos Colony, GRB Ghee, Haldiram Godown, Paper Cups Manufacturing Unit, Scrap Godown Fire, Plywood Shops, Wood Godown Fire, Fire Engines, HYDRA Police, Fire Department, Short Circuit, Property Damage, Hyderabad Latest News, Fire Safety ]

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
ఇటీకాల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ఉద్యోగుల పని వాతావరణంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పండుగ వేళ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.