వండిన కూర నచ్చలేదని భార్యపై దాడి .. నవవధువు మృతి..!

Publish Date:Aug 11, 2026

Advertisement

 

పెళ్లైన ఆరు నెలల్లోనే విషాదం..!

పెళ్లై ఆరు నెలలే... కాళ్ల పారాణి ఆరకముందే ఆమె జీవితం విషాదంగా ముగిసింది. కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవవధువు.. భర్త కోసం వండిన కూరే చివరకు ఆమె ప్రాణాలు తీసేంతటి విషాదానికి కారణమైంది. కూర రుచిగా లేదన్న చిన్న మాటతో మొదలైన గొడవ.. క్షణాల్లో తీవ్ర రూపం దాల్చింది. భర్త నెట్టడంతో గోడకు తల బలంగా తగిలి.. ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఆరు నెలల వైవాహిక బంధం.. అంతలోనే కుటుంబానికి కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయింది.

హైదరాబాద్‌ కాటేదాన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వండిన కూర నచ్చలేదన్న కారణంతో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ.. చివరకు భార్య మృతికి దారితీసింది. కాటేదాన్‌ పరిధిలోని శ్రీరాం నగర్‌లో ఈ ఘటన జరిగింది. శిక్షాంజలి కుమారికి చందన్‌ కుమార్‌తో ఆరు నెలల క్రితం వివాహమైంది. పెళ్లైన కొద్దిరోజులకే ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

తాజాగా వండిన కూర రుచిగా లేదంటూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో చందన్‌ కుమార్‌ ఆగ్రహానికి గురై శిక్షాంజలి కుమారిని బలంగా నెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తల గోడకు బలంగా తగిలి కిందపడిపోయింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోవడంతో చందన్‌ కుమార్‌ ఆస్పత్రికి తరలించాడు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించగా.. అప్పటికే శిక్షాంజలి కుమారి మృతి చెందినట్లు నిర్ధారించారు.

కూతురిని అత్తింటికి పంపిన ఆరు నెలల్లోనే ఆమె మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జీవితాంతం కలిసి ఉంటారని ఆశించిన కుటుంబానికి ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చందన్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది? దాడికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Hyderabad Crime, Katedan Incident, Mylardevpally Police, Newlywed Woman Death,
Wife Death, Husband Wife Dispute, Domestic Dispute,Shikhanjali Kumari, Chandan Kumar
Osmaniya Hospital
 

By
en-us Political News

  
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
ఒకవైపు పార్టీ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే.. మరొ వైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు మాత్రం ప్రజా సమస్యల సభలో గళమెత్తుతానంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం నెట్టింట తెగ ట్రోల్ అవుతోంది.
13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..!
సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి  విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను  మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే  విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన   సాగిందని నివేదిక పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు
రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు
 భార్య బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.