హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుడు గోపాలరావు కన్నుమూత

Publish Date:Apr 24, 2026

Advertisement

 

హైదరాబాద్ పుస్తక రంగా నికి విశిష్ట సేవలందించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధప డుతూ కొండాపూర్ లోని తన కుమారుడి నివాసంలో  ఏప్రిల్ 23న తుదిశ్వాస విడిచారు. గోపాలరావు 1986లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ స్థాపకుల్లో ముఖ్య పాత్ర పోషించారు. తొలి పుస్తక ప్రదర్శన నిర్వహణలో సమన్వ యకర్తగా వ్యవహరించి, నగరంలో పుస్తక సంస్కృతి ని విస్తరించడంలో కీలక పాత్ర వహించారు. అలాగే తన సైంటిఫిక్ సర్వీసెస్ సంస్థ ద్వారా పుస్తక రంగానికి అనేక సేవలు అందించారు. 

పుస్తక ప్రదర్శనల నిర్వహణలో ఆయన చేసిన కృషి పుస్తకాభిమానులు, ప్రచురణకర్తలు ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా నిలిచింది. ఆయన భౌతిక దేహాన్ని ఏప్రిల్ 26 ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని స్వగృహంలో మిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గోపాలరావు మరణంపై హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డా. కవి యాకూబ్, కార్యదర్శి ఆర్. వాసు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పుస్తక రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మర ణీయమని పేర్కొన్నారు. పుస్తక సంస్కృతిని ప్రజల్లో విస్తరించేందుకు జీవితాన్ని అంకితం చేసిన గోపాలరావు మరణం పుస్తక ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.