హైదరాబాద్ మెట్రో ఛార్జీలు మే రెండో వారం నుండి పెరిగే ఛాన్స్ ఉంది. కనిష్ట ఛార్జీ రూ. 15 వరకు, గరిష్ట ఛార్జీ రూ. 75 వరకు పెరగవచ్చు. ఎల్ అండ్ టీ ఈ పెంపు ద్వారా ఏడాదికి అదనంగా రూ. 150 కోట్లు ఆర్జించాలని భావిస్తోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి.. సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో L&T మెట్రో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టీ ఈ సంస్ధ కోరింది. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసింది.
ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో ఉంది మెట్రో సంస్థ. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్‌ను సంస్థ ఎత్తివేసింది. మెట్రో కార్యకలాపాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం.. మాల్స్‌లో అద్దెల ద్వారా సంస్థకు ఏటా సుమారు రూ. 1500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే.. మెట్రో రైలు నిర్వహణ, బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీలు.. ఇతరత్రా ఖర్చులు అన్నీ కలిపి సంవత్సరానికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు వ్యయం అవుతోందని L&T అధికారులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-25-197429.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.