కేసీఆర్‌కు హైబీపీ!.. ప్రగతిభవన్‌లో హైడ్రామా!...
Publish Date:Nov 2, 2021
Advertisement
ఇంట్లోనే కూర్చొన్నారు. ప్రగతిభవన్ నుంచే పక్కా స్కెచ్ వేశారు. అనేక రాత్రులు నైట్ అవుట్‌లు చేశారు. తన చాణక్య మెదడుకు మరింత పదును పెట్టారు. తన మాయల మరాఠీ విద్యలన్నిటినీ మదించారు. వాటన్నిటినీ రంగరించి.. ఈటల రాజేందర్‌పై ప్రయోగించారు. కాలికింద నల్లిలా నలిపేయాలని చూశారు. కానీ, ఇలా ఈటల విజయకేతనం ఎగరవేసి.. ఈటెలా ప్రగతిభవన్ గుండెల్లో పొడుస్తారని అస్సలు ఊహించలేకపోయారు. ఉదయం నుంచీ టీవీల్లో హుజురాబాద్ ఎన్నికల ఫలితాలను చూస్తున్న సీఎం కేసీఆర్‌లో అసహనం, కోపం, ఆక్రోషం పెరిగిపోతున్నాయట. పట్టరాని కోపంతో పళ్లు పటపటా కొరుకుతున్నారట. ప్రగతిభవన్‌లో ఇప్పుడంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటున్నారు. కేసీఆర్ అరుపులతో రీసౌండ్ వస్తోందని చెబుతున్నారు. గులాబీ బాస్ అంత కోపంతో ఊగిపోవటం సహజమే. ఈటలను తొక్కిపడేయాలని చూస్తే.. ఆయనేమో గోడకు కొట్టిన బంతిలా.. ప్రగతిభవన్ వైపు దూసుకొస్తున్నారు. రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యం..ఆధిపత్యం పెంచుకుంటూ.. అసెంబ్లీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. టీవీల్లో ఆ రిజల్ట్స్ అప్‌డేట్ చూస్తూ.. కేసీఆర్ కంగయిపోతున్నారు. డల్‌గా.. డీలాపడిపోయారని అంటున్నారు. ఎంత ట్రై చేశారు.. ఈటలను ఓడించాలని ఎంత కసిగా ప్రయత్నించారు. యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడే మోహరించారు. అల్లుడు హరీశ్‌రావును అక్కడే ఉంచేశారు. మంత్రి గంగులనూ హుజురాబాద్‌లోనే కట్టేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కులాలు, వర్గాల వారీగా వారాల తరబడి అక్కడే తిప్పారు. ఇంతా చేస్తే.. ఏ ఒక్క రౌండ్‌లోనూ ఆ సంతోషం కనిపించలేదు. ఓటర్లు కారు గుర్తును తుక్కు తుక్కు చేశారు. కమలాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అంత చేస్తే.. ఇంతే ఫలితమా? అంటూ కేసీఆర్ తీవ్రంగా కలత చెందుతున్నారని తెలుస్తోంది. ఈటల ఆరోపించినట్టు.. తనను ఓడించడానికి 500 కోట్లు ఖర్చు చేశారట కేసీఆర్. అది కాకుండా ఓటుకు 6వేలు చొప్పున పంచారట. హుజురాబాద్‌లో పెండింగ్ పనంటూ లేకుండా.. అన్నిపనులూ పూర్తి చేసేవారు. నియోజకవర్గాన్ని అద్దంగా, అందంగా మార్చేశారు. ఇది హుజురాబాదా? హైదరాబాదా? అన్నట్టు నెలల వ్యవధిలోనే అరచేతిలో అద్భుతం ఆవిష్కరించారు. ఇంతగా మాయల మారఠీ, టక్కు టమారం విద్యలు ప్రదర్శించినా.. ఆ మేరకు ఫలితం రాకపోవడం కేసీఆర్‌ను కలవరపాటుకు గురి చేస్తోందని అంటున్నారు. దళితబంధుతో పిచుకలాంటి ఈటల రాజేందర్‌పై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు కేసీఆర్. అది కాస్తా ఆయనకే బూమరాంగ్ అయినట్టు ఫలితాలతో తేలిపోయింది. ఈటల వల్లే దళితబంధు ఇస్తున్నారని.. ఓటర్లు భావించినట్టున్నారు. అందుకే దళితబంధు లబ్దిదారుల్లో కొందరు పువ్వు గుర్తుకే గుద్దేశారు. ఎన్నికల్లో కారును చితక్కొట్టేసి.. స్క్రాబ్‌గా మార్చేసి.. షెడ్డుకు తరలించేశారు. అందుకే కేసీఆర్ ఇంతలా ఇదవుతున్నారని అంటున్నారు. ఈటలతో ప్రగతిభవన్‌కు బీటలు వారుతుండటాన్ని కేసీఆర్ తట్టుకోగలరా?
http://www.teluguone.com/news/content/huzurabad-bypoll-bjp-win-cm-kcr-shock-25-125687.html





