హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఖైతలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. రహీమ్, సుమేరా దంపతులకు 2024లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రహీమ్‌కు, భార్య సుమేరాతో గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన రహీమ్, సుమేరాపై కత్తితో దాడి చేసి గొంతు కోసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.హత్య అనంతరం నిందితుడు నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే అతడు లొంగిపోయాడా, లేక పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఒక చిన్నారి తల్లిని కోల్పోయేలా చేసిన ఈ విషాద ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీయడం పట్ల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "కుటుంబ వివాదం.. క్షణికావేశం.. ఓ మహిళ ప్రాణం బలి" అంటూ ఈ ఘటన కూకట్‌పల్లిలో చర్చనీయాంశంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/husband-murdered-wife-by-slitting-her-throat-36-221829.html
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.