తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ దొంగ దొరికాడు
Publish Date:Sep 11, 2025
Advertisement
తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో హుండీలో సమర్పించే కానుకలను దొంగిలిస్తూ ఓ దొంగ పట్టుబడ్డాడు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుంచి నగదు చోరీ చేసిన దొంగను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదును చోరీ చేశాడు. నాలుగువేల రూపాయలను సదరు దొంగ హుండీ నుంచి చోరీ చేయడాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సీసీటీవీలో గమనించిన అధికారులు వెంటనే విజిలెన్స్, భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని పట్టుకుని అతడిని పోలీసులకు అప్పగించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hundi-thief-caught-in-tirumala-36-206027.html
http://www.teluguone.com/news/content/hundi-thief-caught-in-tirumala-36-206027.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026





