Publish Date:Jun 29, 2022
సముద్రం మీదకి వెళ్లి రోజంతా వల విసిరి సాయంత్రానికి ఓ పది చేపలు కాస్తంత పెద్దవి పట్టుకు వస్తే మత్స్యకారుల కుటుంబానికి, ఒడ్డున వేచి వున్నవారందరికీ తెగ సంబరం. ఎప్పుడో గాని బాగా పెద్ద చేపలు పడవు. కానీ వలతో వేటకు వెళ్లకా తప్పదు. కానీ వేటకి వెళ్లినవారికి హఠాత్తుగా అతి పెద్ద, పురాతన చేప దొరికితే? దాన్ని పట్టి అతికష్టంమీద బయటికి తీసికొచ్చి చూసి ఆనందిస్తారా, కోసి వారం రోజులు తినేద్దా మనుకుంటారా? సాధారణంగా రెండో ఆప్షన్ కే ఇష్టపడతారు జనాలు. కానీ స్టీవ్, మార్క్ అనే మత్స్యకారు లు మాత్రం అలా అనుకోలేదు. వాళ్లు మొదటి ఆప్షన్ నే ఎంచుకున్నారు.
విషయమేమంటే.. బ్రిటీష్ కొలంబియాకి చెందిన స్టీవ్, మార్క్‌లు నదీజలాల్లో వేటాడటంలో వలను వొడు పుగా విసిరేసి పట్టగల మరో ఇద్దరు నిపుణులతో కలిసి లిల్లూటీ అనే నదిలోకి ప్రయాణమయ్యారు. రెండు గంటల తర్వాత హఠాత్తుగా వారికి తెల్లటి స్టర్జియన్ పట్టుబడింది. దాని సైజు చూసి నిర్ఘాంతపోయారు. అది ఏకంగా పధ్నాలుగు అడుగులు వుంది. మరీ చిత్రమేమంటే దాని వయసు సుమారు వందేళ్లు! దాని బరువు ఏకంగా 317 కేజీలు. దాని నడుము చుట్టుకొలత 57 అంగుళాలు. ఇది నిజంగానే అతి ప్రాచీన కాలం చేప అంటున్నారు జల జీవాల నిపుణులు. ఉత్తర అమెరికాలోని నదీజలాల్లో ఇటువంటివి అప్పుడపుడు కనపడతాయిట. ఇవి 14 అడుగుల పొడవు, 680 కిలోల బరువు వరకూ పెరుగుతాయిట.
కాగా ఈ తెల్ల సర్జియన్ చేప శరీరంపై ఎముకల పలకలతో చాలా పెద్ద ఆదిమ చేప. ఇది సమశీతోష్ణ సము ద్రాలు ఉత్తర అర్ధగోళంలోని నదులలో, ముఖ్యంగా మధ్య యురేషియాలో కనపడుతుంది. దాని మాంసా నికి వాణిజ్య ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి చేపలు కనీసం 150 ఏళ్లు జీవిస్తాయని జల జీవాల పరిరక్షణ సంస్థ అధికారులు తెలిపారు. అయితే ఈ సర్జియన్‌ను పట్టుకున్న వారు దాని చరిత్రను తెలుసుకుని, అధికారులకు తెలియజేసి మళ్లీ విశాల జలప్రవాహంలో జాగ్రత్తగా వదిలేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hunderd-years-old-fish-caught-and-leave-39-138670.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.