మునుగోడు హుజురాబాద్ కాదు!

Publish Date:Oct 13, 2022

Advertisement

హుజురాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఅర్ కోరి తెచ్చుకున్నారు. గులాబీ పార్టీ ఓన‌ర్లం మేమే అంటూ ఈటల రాజేందర్ ధిక్కార స్వరం వినిపించిన నేపధ్యంలో, ఇంకెవరూ అలాంటి సాహసం, చేయకుండా ఈటలపై వేటు వేశారు. అయితే కేసీఆర్ లెక్క తప్పింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో, కేసీఆర్ సర్వ శక్తులు ఒడ్డినా ఓటమి తప్పించుకోలేక పోయారు.

 బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన ఈటల 20 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరేశారు.  నిజానికి, హుజురాబాద్ ఓటమి అక్కడితో ఆగలేదు. ఈటల ఏకుమేకయ్యారు. అంతవరకు సక్సెస్ ‘స్టొరీ’గా సాగిన తెరాస కథ మలుపు తిరిగింది.  తెరాసకు చిక్కులు మొదలయ్యాయి. అంతవరకు కేంద్రంలో అధికారంలో ఉన్నా  రాష్ట్ర రాజకీయాల్లో పక్కాగా థర్డ్ ప్లేస్ లో ఉన్న బీజేపీ, అటు కాంగ్రెస్ కు ఇటు తెరాసకు కూడా సవాలుగా మారింది.  తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం కన్ను పడింది. ఇక ఆ తర్వాత ఏమి జరుగుతోందన్నది చరిత్ర.

ఈ క్రమంలోనే, మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక దానంతట అదిగా వచ్చింది కాదు. హుజురాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ ఎలా అయితే కోరి తెచ్చుకున్నారో అదే విధంగా మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ కోరి తెచ్చుకుంది. ఫలితం కూడా అలాగే ఉంటుందా  అంటే అది వేరే చర్చ. కానీ హుజురాబాద్  లో కనిపించిన తెరాస దూకుడు, మునుగోడులో కనపడడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా  తెరాస నాయకత్వం మునుగోడు విషయంలో తప్పుడు సంకేతాలు పంపిస్తోందని అంటున్నారు.

అభ్యర్ధి ఎంపిక మొదలు  ప్రచార వ్యూహం వరకు తెరాస నాయకత్వం అడుగులు తడబడుతున్న వైనం కనిపిస్తోందని అంటున్నారు. హుజురాబాద్  అంతకుముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఇంచార్జిగా వ్యవహించారు. ఆ రెండు ఉపఎన్నికల్లో తెరాస ఓడినా  చివరి వరకు గులాబీ పార్టీలో ఓటమి భయం కనిపించలేదు. మునుగోడు విషయంలో ఇప్పటికి కూడా ఇంచార్జి విషయంలో పూర్తి స్పష్టత లేదు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కంగాళీ వ్యవహారంతో, ‘టూ మెనీ కుక్స్ స్పాయిల్  ద డిష్’ అన్నట్లుగా మునుగోడు వంటకం తయారవుతుందని అంటున్నారు. 

మరో వంక తెరాసని ఓటమి భయం వెంటాడుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే, తెరాస నాయకత్వం  తప్పుడు సంకేతాలు పంపిందని పార్టీ శ్రేణులనుంచే వినిపిస్తోంది. ఒక విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్  అభ్యర్ధి ఎంపిక విషయంలో మీనా మేషాలు లెక్కిస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత  మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈలోగా పార్టీలో లుకలుకలు కొన్ని బయట పడ్డాయి. అదెలా ఉన్నా అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి సర్వేలపై ఆధారపడి, చివరి వరకూ ఎటూ తేల్చుకోలేక పోవడం పార్టీ బలహీతను బయట పెట్టుకున్నట్లు అయిందని, పరిశీలకులు అంటున్నారు.  ఆలాగే, తోక పార్టీలు, సూదీ దబ్బనం పార్టీలంటూ అవహేళన చేసిన సిపిఐ, సిపిఎం పార్టీలతో ‘బేరం’ కుదుర్చుకోవడం, ఒక ఉప ఎన్నిక కోసం ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కూడా రాంగ్ సిగ్నల్స్ పంపిందని అంటున్నారు.  అదలా ఉంటే, ఒక్క ఉప ఎన్నికలో గెలుపు కోసం ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కుమార్తె కవిత మినహా ఎమ్మెల్సీలు, అందరికీ ముక్కలు ముక్కలుగా బాధ్యతలు అప్పగించడం, ఓటమి భయాన్ని సూచిస్తోందని అంటున్నారు.  

మరో వంక మంత్రి కేటీఆర్ మునుగోడు ఎన్నికల ఫలితం వల్ల టీఆర్ఎస్‌కు వచ్చేది పోయేది ఏమీ లేదని చెబుతూ వస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలప్పుడూ అదే చెప్పారు. తేడా వస్తుందన్న రిపోర్టులు ఉండటం వల్లనే ఇలా చెబుతున్నారన్న అభిప్రాయానికి రావడాని ఇలాంటి వ్యాఖ్యలు కారణం అవుతున్నాయని అంటున్నారు. ఈ అన్నిటినీ మించి, పార్టీ అభ్యర్ధి నామినేషన్ అయినా వేయక ముందే, మంత్రులు ఒకరి వెంట ఒకరు, పోటీ పడి మరీ పోటీ నుంచి తప్పుకుంటామని చేస్తున్న ప్రకటనలు క్యాడర్ కే కాదు,. కాండిడేట్ (కూసుకుంట్ల)కు కూడా మింగుడు పడడం లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న గుజరాత్ కు ప్రధాని మోడీ భారీగా కేంద్ర నిధులను కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్న మంత్రి కేటీఅర్, ప్రధాని మోడీ మునుగోడుకు రూ. పద్దెనిమిది వేల కోట్ల నిధులు ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. అంతకు ముందే మునుగోడు మంత్రి జగదీష్ రెడ్డి అదే సవాల్ చేశారు. ఇక ఇప్పుడు ఎర్రబెల్లి ఇత్యాది మంత్రులంతా అదే పల్లవి ఎత్తుకున్నారు. అయితే, మంత్రులు పోటీ నుంచి తప్పుకుంటామని పదే పదే చెప్పడం వలన తెరాస నేతలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే పలాయనవాదం జపిస్తున్నారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు.

ఒక విధంగా నెగిటివ్ పబ్లిక్ పర్సెప్షన్  క్రియేట్ అవుతోందని పబ్లిక్ పల్స్ తెలిసిన విశ్లేషకులు బావిస్తున్నారు.  ఓ వంక బీజేపీ అభ్యర్ధి రాజగోపాల రెడ్డి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? దమ్ముంటే పోటీకి రండని,  సవాల్ విసురుతుంటే, కేటీఆర్ పలాయనవాదం చిత్తగించడం ఏమిటని, పార్టీ నాయకులే విస్తుపోతున్నారు. నిజానికి, రాజీనామాకు ముందే రాజగోపాల్ రెడ్డి తెరాస ప్రభుత్వానికి సిమిలర్ సవాల్  విసిరారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజక వర్గాల్లో చేసిన అభివృద్ధి మునుగోడులో చేస్తే, రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయనని, రాజగోపాల్ తెరాసకు సవాల్ చేశారు. తెరాస ప్రభుత్వం ఆ సవాలు స్వీకరించలేదు, కాబట్టే రాజగోపాల రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పడు అదే సవాలును ఇటు నించి అటు తిప్పడంలో అర్థమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అంతిమ ఫలితం ఎలా ఉన్నా, తెరాసను మునుగోడులోనూ  హుజురాబాద్ భయం వెంటాడుతోందని అనిపిస్తోందని, అంటున్నారు.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.