భావనపాడు తీరంలో భారీ నౌక
Publish Date:Feb 22, 2023
Advertisement
శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరంలో భారీ నౌక డిజైర్ లంగరేసింది. ఇక్కడి మూలపేట ప్రాంతంలో గత నెల రోజులుగా మూలపేట పోర్టు ఆధారిత సముద్ర తీర ప్రాంతాల్లో సాయిల్ టెస్టులు నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. అందు కోసం ఈ డిజైర్ నౌక గత నెల రోజులుగా పనిచేస్తోంది. ఆ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరమ్మతుల కోసం నౌకను తీరానికి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. భారీ నౌకను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలు ప్రజలు భావనపాడు తీరానికి చేరుకున్నారు. ఈ నౌక వల్ల ఎటువంటి ప్రమాదం లేదనీ, అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనీ, ఇది భారత ప్రభుత్వాని చెందిన నౌకేననీ మెరైన్ సీఐ తెలిపారు. మరమ్మతులు పూర్తి కాగానే తీరం నుంచి వెళ్లిపోతుందని వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-ship-in-bhawanapadu-shore-25-151765.html
http://www.teluguone.com/news/content/huge-ship-in-bhawanapadu-shore-25-151765.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026





