పాక్ లో లీటర్ పెట్రోలు ధర ఎంతో తెలుసా?

Publish Date:Apr 2, 2026

Advertisement

పాకిస్థాన్ కు చమురు సంక్షోభం గోరుచుట్టుపై రోకటి పోటులా పరిణమించింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. దీంతో పాకిస్థాన్ కు ఆ పెరిగిన భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు ఈ పరిణామం తలకు మించిన భారంగా మారింది.  

పాక్ ఆర్థిక మంత్రి   మహమ్మద్ ఔరంగజేబ్, పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ బుధవారం (ఏప్రిల్ 2) రాత్రి  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ భారీ పెంపు కారణంగా లీటర్ హై-స్పీడ్ డీజిల్ ధర ఏకంగా రూ. 184.49 లు  పెరిగి రూ. 520.35కు చేరింది. ఇక పెట్రోల్ ధర అయితే  పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 137.23లు పెరిగి రూ. 458.40కు చేరింది. ఇలా ఉండగా నెల రోజుల వ్యవధిలో పాకిస్థాన్ పెట్రో ధరలను పెంచడం ఇది రెండో సారి.  కాగా పెరిగిన ధరలు ఈ నెల మొదటి తేదీ నుంచే అమలులోకి వచ్చాయి.

By
en-us Political News

  
ప్రస్తుతం నేషనల్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే రహదారి, ఫ్లై ఓవర్ నిర్మాణాలు, సర్కిల్ విభాగాలు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి అవసరమైన ప్రధాన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది, వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రముఖుల ప్రసంగాలు, బహిరంగ సభ కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు.
కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుండగా.. జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కి చెందిన 35 ఏళ్ల ముఖ్తార్ యూనస్ మరణించాడు.
చైనీస్ చిప్‌మేకర్ చాంగ్ క్సిన్ 470% లిస్టింగ్ జంప్ సాధించి అర ట్రిలియన్ డాలర్ల విలువను తాకింది. ఈ గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారత్ ఎలాంటి సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీగ్‌లోకి అడుగుపెట్టవచ్చో వివరంగా తెలుసుకోండి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు లాభపడగా, ఆర్‌బిఐ చర్యలతో రూపాయి కూడా బలపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి!
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన నూతన AI సెక్యూరిటీ టూల్స్ ప్రాజెక్ట్ పెర్సెప్షన్ మరియు MAI Cyber 1 Flash ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల కంటే 12% మెరుగైన 96% స్కోరుతో, సగం ధరకే లభిస్తున్నాయి. దీని పూర్తి సాంకేతిక వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి!
ర్నాటక పిటిషన్ విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనల మేరకు ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్3 కోసం 29 వేల కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయనీ పేర్కొంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి 2nm x86 సర్వర్ ప్రాసెసర్ AMD EPYC 9006 Venice విడుదల వివరాలు. 256 కోర్లు, 512 థ్రెడ్లు, PCIe 6.0 సపోర్ట్ మరియు 1.6 TB/s బ్యాండ్‌విడ్త్‌తో రాబోతున్న ఈ సూపర్ చిప్ విశేషాలు తెలుసుకోండి.
E20 పెట్రోల్ అంశంలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారం మరియు డీప్‌ఫేక్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటా, గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలపై పరువు నష్టం దావా వేసేందుకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
వేర్వేరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్లలో దాదాపు 79.4% వరకు పోర్ట్‌ఫోలియో ఓవర్‌లాప్ ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. మీ పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు మరియు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మధ్య భారత రూపాయి ఎలా బలమైన ప్రదర్శన ఇచ్చిందో తెలుసుకోండి. ఆర్బీఐ తీసుకున్న సంచలన వ్యూహాత్మక చర్యలు, విదేశీ ద్రవ్య ప్రవాహాల పెంపుదల మరియు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం గురించి సమగ్ర కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.