ఇలా చేస్తే స్నేహం పదిలం.. పదిలం...

Publish Date:Aug 5, 2023

Advertisement

ఒకసారి ఇద్దరు స్నేహితులు చాలా దూరం కలసి ప్రయాణం చేయాల్సివచ్చింది. అడవులు, ఎడారులు, మైదానాలు, కొండలు, గుట్టలు... ఇలా వారి ప్రయాణం సాగింది. ఇద్దరూ ఎంతో ప్రాణస్నేహితులు. ఈ ప్రయాణంలో కాలక్షేపానికి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. ఒకోసారి కొన్ని విషయాలపై ఇద్దరికి అభిప్రాయం కలవక తీవ్రస్థాయిలో వాదించుకునేవారు. ఆ వాదన కాస్తా కాసేపటికి విషయం నుంచి డైవర్ట్ అయ్యి వ్యక్తిగత విషయాలని విమర్శించే దాకా వెళ్ళేది. ఇలా జరిగినప్పుడల్లా అందులో ఒక స్నేహితుడు ఆ విషయాన్ని ఇసుకపై వేలితో రాసేవాడు. రాసిన కాసేపటికి తిరిగి తన స్నేహితుడితో మునుపటిలా ప్రేమగా మాట్లాడేవాడు. ఇలా వారి ప్రయాణం సాగిపోతోంది.

స్నేహితుల్లో ఒక అతను ఇసుకపై వేలితో రాయటాన్ని గమనించిన మరో స్నేహితుడు ఏం రాస్తున్నావు? ఎందుకలా  రాస్తున్నావు అని అడిగితే ఇతను నవ్వేసి ఏం లేదు అని చెప్పేవాడు. ఒకసారి స్నేహితుల్లో  ఇలా రాసే వ్యక్తి ఓ ప్రమాదంలో పడతాడు. కొండ చివరి నుంచి లోయలోకి పడబోయే ఇతన్ని అతని స్నేహితుడు ఎంతో కష్టంగా రక్షిస్తాడు. ఆ క్రమంలో అతనికి ఎన్నో దెబ్బలు కూడా తగులుతాయి. ఓ క్షణం అతను కూడా లోయలోకి పడబోతాడు. అంటే తన ప్రాణాలని కూడా లెక్కచేయకుండా తన స్నేహితుడిని రక్షిస్తాడు.


లోయలోకి పడబోతున్న అతని స్నేహితుడు ప్రాణాలు పణంగా పెట్టి రక్షించగానే, రక్షించబడ్డ వ్యక్తి వెంటనే చేసిన పని, తన స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పి, వెంటనే పక్కనే వున్న రాతిపై చెక్కటం మొదలు పెట్టాడు. మరో వ్యక్తికి ఇతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఏంటా అని చూస్తే, తను చేసిన సహాయాన్ని ఆ రాయిపై రాయటం గమనించి ఆశ్చర్యపోయాడు. అంతా అయ్యాక విషయం ఏంటని అడుగుతాడు అతను తన స్నేహితుడిని. అప్పుడు ఆ స్నేహితుడు ఇలా చెబుతాడు. చిన్నప్పటి నుంచి మనిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఎప్పుడు ఇలా కేవలం ఇద్దరమే ఇంత దూరం, ఇన్ని రకాల పరిస్థితులని, ప్రమాదాలని కలసి, దాటి ప్రయాణం చేయలేదు. మన ఈ ప్రయాణం గురించి తెలియగానే మా నాన్న నాకు ఓ మాట చెప్పారు. ఇంతవరకు మీరిద్దరు సరదాగా గడిపారు. కాబట్టి మీ మధ్య ఏ భేదాభిప్రాయాలు రాలేదు. ఒకరి కోసం ఒకరుగా ఉన్నారు. కానీ మీరు సాగించే ఈ ప్రయాణంలో మీరిద్దరే వుంటారు. పైగా ఎన్నో ప్రమాదాలు, ఒత్తిడులు. వీటి మధ్య ఎప్పుడైనా ఇద్దరి మధ్య తేడా వస్తే, నీ స్నేహితుడి వల్ల నీకు  బాధ కలిగితే ఆ విషయాన్ని వెంటనే మర్చిపో. అదే నీ స్నేహితుడు నీకు ఏ చిన్నపాటి సాయం చేసినా దానిని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఈ విషయం నువ్వు మర్చిపోకుండా ఉండటానికి నీకు అతనిపై కోపం రాగానే ఆ విషయాన్ని ఇసుకలో రాయి. నీకు చేసిన సహాయాన్ని రాయిపై రాయి. ఇసుకలో రాసినది చెరిగిపోవటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో ఎదుటి వ్యక్తి నీకు చేసిన చెడుని మర్చిపో. రాతిపై రాత ఎంతకాలం నిలుస్తుందో అంత శాశ్వతంగా అతని మంచితనాన్ని గుర్తుపెట్టుకో. అదే "ఇసుకపై రాత, రాతిపై రాత " అని చెప్పాడు అతని తండ్రి.


మనం చాలాసార్లు పైన చెప్పుకున్న దానికి రివర్స్ లో ఎదుటివ్యక్తి మనకు చేసిన మంచిని ఇసుకపై, అలాగే చెడుని రాతిపై రాసి పెట్టుకుంటాం. అంటే ఎవరివల్లనైనా బాధ కలిగితే  శాశ్వతంగా గుర్తు పెట్టుకుని, వారు చేసే మంచిని ఆ బాధ మధ్య మర్చిపోతాం. అందుకే చాలాసార్లు, చాలామందిపై ఆరోపణలు వుంటాయి. అదే వారు చేసే చిన్నచిన్న పొరపాట్లని వెంటనే మర్చిపోతూ,  వారి వలన మనకి కలిగే మంచిని ఎప్పుడూ గుర్తుచేసుకోగలిగితే ఏ బంధంలోనైనా భేదాభిప్రాయాలు రావు.  ఏ ఇద్దరు వ్యక్తులైనా కలసి ప్రయాణం చేయాలంటే ఈ సూత్రం తప్పక గుర్తుపెట్టుకోవాలి.


 

రమ ఇరగవరపు

 

By
en-us Political News

  
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.