పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని మీద ఆధారపడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

Publish Date:Feb 4, 2025

Advertisement

అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా  జీవితాల్లో అతిపెద్ద మలుపు తీసుకునేది పెళ్లితోనే. సింపుల్ గా పెళ్లికి ముందు, పెళ్ళి తరువాత అనే  వ్యత్యాసాన్ని చెప్పేయచ్చు. ఉమ్మడి కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సర్కిల్ ఎక్కువగా  ఉంటే ఆటోమేటిక్ గా పెళ్లి వయసొచ్చిన యువతీయువకుల కోసం పెళ్లి సంబంధాలు అంటూ కబుర్లు వస్తూనే ఉంటాయి. కానీ యెవరికి ఎవరే యమునాతీరే అనేట్టు ఉన్న నేటికాలం జీవితాలల్లో సంబంధాల కోసం ముందుకొచ్చి సహాయం చేసే చుట్టారు, స్నేహితులు తక్కువే. పైపెచ్చు మంచి సంబంధాలు కావాలనే కారణంతో చాలామంది  దగ్గరలో ఉన్నవాటిని పట్టించుకోరు. మంచి సంబంధాల కోసం మ్యాట్రిమోనిలో వెతుకుతుంటారు. అయితే మ్యాట్రిమోనిలో సంబంధాలు వెతికేవారు ఈ కింది విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

ప్రోపైల్ గూర్చి అవగాహన ఉందా?

పెళ్లి సబంధాల కోసం మ్యాట్రిమోనిలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో వరుడు లేదా వధువు ప్రోపైల్ విషయంలో అవగాహన ఉండాలి. వధువు లేదా వరుడి ఫ్రోపైల్స్ రెండు రకాలుంటాయి. ఒకటి ప్రీ ఫ్రోపైల్, రెండు పెయిడ్ ఫ్రోపైల్. ఫ్రీ ప్రోఫైల్ అనేది ముందునుండే ఉన్నది. పెయిడ్ ఫ్రోపైల్ అనేది మ్యాట్రిమోనికి డబ్బు కట్టి క్రియేట్ చేయించుకునేది. దీంట్లో చాలావరకు పేక్ ఉంటాయి. అధికశాతం మంది ఇక్కడే మోసపోతారు.

సామాజిక మాద్యమంతో జాగ్రత్త..

సోషల్ మీడియా ఇప్పుడు చాలా భీభత్సంగా  మారింది.  కాస్త మాటలు మొదలైతే చాలు  ఎంతో సులువుగా దగ్గరైపోయేవారు ఉన్నారు. సన్నిహింతంగా మాట్లాడగానే వ్యక్తిగత సమాచారం షేర్ చేసేవారున్నారు. వీటి వల్ల  భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి పొరపాటున కూడా వివరాలు ఎవరికీ ఇవ్వకండి.

దూరమే శ్రేయస్కరం..

పెళ్ళి ఖాయం అయినా పెళ్ళి పూర్తయ్యే వరకు కాబోయే భార్యాభర్తలను అస్సలు కలవనిచ్చేవారు కాదు ఒకప్పుటి పెద్దలు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి పిక్స్ అనే మాట వినగానే పెళ్లి జరగడానకి ముందు బోలెడు సార్లు కలుస్తారు. షాపింగ్ చేస్తారు. టూర్లకు కూడా వెళతారు. కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండటం మంచిది. పెళ్లి జరిగే వరకు అమ్మాయిలు తమను తాము సేప్టీగా ఉంచుకోవడం మంచిది. అదే విదంగా సోషల్ మీడియా పరిచయాలు ప్రేమ, పెళ్లికి దారితీస్తే పెద్దల నిర్ణయం తరువాతే వాటి విషయంలో ప్రోసీడ్ అవ్వడం మేలు.

మనీ మాటర్స్..

పెళ్లి ఓకే అనగానే కొందరు, పెళ్లి వలలోకి లాగడానికి కొందరు, పెళ్లి పేరుతో మోసం చెయ్యడానికి మరికొందరు డబ్బును, బహుమతులను ఇవ్వడం, ఆశించడం చేస్తారు. అయిచే పెళ్లి  జరిగే వరకు ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిది.
 

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.