విద్యార్థులు విజయం సాధించాలి అంటే.. ఈ పనులు చెయ్యాలి!

Publish Date:Feb 20, 2025

Advertisement

 

ప్రతీ విద్యార్థి సర్వసాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య పట్టుదల కోల్పోవడం. సాధారణంగా విద్యార్థి మనస్తత్వం ఎలా ఉంటుందంటే 'సినిమాకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వర్షం కురిస్తే దాన్ని ఆటంకంగా భావించడు. అదే వర్షం కళాశాలకు బయలుదేరుతున్నప్పుడు పడితే దాన్ని మాత్రం పెద్ద ఆటంకంగా భావిస్తాడు'. అందుకు కారణం అతడి అభిరుచి చదువుపై కన్నా సినిమాపైనే అధికంగా ఉండడమని మనకు అర్థమవుతుంది.

అభిరుచి - ఉత్సాహం - మనోబలం = లక్ష్యసిద్ధి. 

ముందు మనం చేసే పని మీద అభిరుచి కలిగి ఉండాలి. ఎప్పుడైతే పని పట్ల అభిరుచి ఏర్పడుతుందో అప్పుడు దాన్ని సాధించేందుకు ఉత్సాహం పెరుగుతుంది. అలాంటి ఉత్సాహం ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొనే మనోబలాన్ని సమకూరుస్తుంది. ఆ మనోబలంతో లక్ష్యాన్ని సాధించవచ్చు. విద్యార్థి అయినా, వ్యాపారవేత్త అయినా, శాస్త్రవేత్త అయినా, ఏ ఇతర రంగానికి చెందినవారైనా తమ లక్ష్యసిద్ధికి పైన తెలిపిన సూత్రమే అనుసరణీయం. మానవుని ప్రగతి సౌధానికి ఉత్సాహమే పునాది. ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చనే మనోబలం చేకూరుతుంది. అది లేకపోతే అంతా అసాధ్యంగా తోస్తుంది.

 Enthusiasm is at the bottom of all progress. With it there is accomplishment. Without it there is only disappointment. Mary Mc Carthy

ఉత్సాహం గమ్యాన్ని చేర్చే వాహనమైతే, దాన్ని నడిపించే ఇంధనమే మనోబలం. జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ సాధించ లేకపోవడానికి కారణం మనోబలం లేకపోవడం. ఏమీ లేకపోయినా దేనినైనా సాధించడానికి కారణం మనోబలం కలిగి ఉండడం. కాళ్ళు, చేతులు లేని అవిటివారైనా, చూపు లేని అంధులైనా, మాటరాని మూగవారైనా, కటిక దారిద్య్రం కబళించినా మనోబలంతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. అలాంటి మహాత్ముల గురించి తెలుసుకుంటే మన లక్ష్యసిద్ధికి కావాల్సిన అభిరుచి, ఉత్సాహం, మనోబలం పెంపొందుతాయి.

అంధత్వం, మూగతనం, చెవుడు - మూడూ కలిసి పరిహాసం చేసినా దిగులుచెందక అంతరిక్షంలో తొలిసారిగా పయనించిన మహిళ తెరిస్కోవా. చెవిటివాడైనా సంగీత సామ్రాజ్యానికి సామ్రాట్గా నిలిచాడు బెతోవెన్. కటిక దారిద్య్రం కాఠిన్యం  ప్రదర్శించినప్పటికీ విద్యావంతులై భారత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి, అమెరికా అధ్యక్షునిగా అబ్రహం లింకన్లు ఖ్యాతి గడించారు. ఆగని కెరటాలలా ఒకదాని తరువాత ఒకటి వచ్చే అపజయాలకు నిరాశ చెందకుండా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగారు థామస్ ఆల్వా ఎడిసన్. ఇలాంటి స్ఫూర్తి దాతలు ఎంతోమంది ఉన్నారు. వీరందరినీ చరిత్ర పుటల్లో చిరస్మరణీయులుగా చేసిన ఒకే ఒక్క మహత్తరశక్తి 'మనోబలం'. అలాంటి మనోబలం, ఆత్మశక్తి మనలో కూడా వృద్ధి చెందాలంటే… మనోబలం పెంపొందడానికి  స్వామి వివేకానంద ఇచ్చిన సందేశాలు ప్రతి నిత్యం మననం చేయాలి.

To succeed, you must have tremen- dous perseverance, tremendous will. "I will drink the ocean," says the perse- vering soul, "At my will mountains will crumble up". Have that sort of energy, that sort of will, work hard, and you will reach the goal. - Swami Vivekananda

మనోబలానికి మారుపేరుగా నిలిచిన మారుతి వజ్రాసనంలో కూర్చొని ఉండడాన్ని చిత్రపటాల్లో మనం గమనించవచ్చు. వజ్రాసనం మనోబలాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాల పాటు 'వజ్రాసనం' అభ్యసించాలి. ఆత్మశక్తికి ప్రతీకలుగా నిలిచిన వీరహనుమాన్, ధీర వివేకానందలను ఆదర్శంగా తీసుకొని ఈ రెండు సూచనల్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే, మనోబలం తప్పక పెంపొందుతుంది. అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధించవచ్చు. ఇది విద్యార్థులందరికీ ఎంతగానో తోడ్పడుతుంది.

                                       *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.