80వేల ఉద్యోగాలు.. TSPSC వెబ్‌సైట్‌లో ఇలా అప్లై చేయాలి...
Publish Date:Mar 9, 2022
Advertisement
80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ సర్కారు. జోన్లు, శాఖల వారీగా.. ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. గ్రూప్స్ జాబ్స్ మాత్రం పరిమితంగానే ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో చాలా వరకు TSPSC ద్వారా భర్తీ కానున్నాయి. ఆయా పోస్టులకు TSPSC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. జాబ్స్‌కు అప్లై చేసేకంటే ముందే.. అభ్యర్థి TSPSC వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్-OTR చేయాల్సి ఉంటుంది. కింది స్టెప్స్ ఫాలో అవుతూ.. TSPSC OTR కంప్లీట్ చేసేయండి మరి.... Step 1- ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Step 2- హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Step 3- Aadhaar Details సెక్షన్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి. Step 4- Personal Details సెక్షన్‌లో ssc సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ తదితర వివరాలు ఎంటర్ చేయాలి. Step 5- Address Details సెక్షన్‌లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Step 6- Educational Qualifications సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. Step 7- ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి. Step 8- Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. Step 9- ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి. Step 10- ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి. Step 11- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది.
http://www.teluguone.com/news/content/how-to-apply-for-govt-jobs-in-tspsc-39-132794.html





