వేసవిలో రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Publish Date:Apr 1, 2025

Advertisement




వేసవి కాలం వచ్చేసరికి మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం. చెమట ద్వారా శరీరం నుండి చాలా నీరు పోతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది తగినంత నీరు తాగరు, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఒక సాధారణ మనిషి రోజుకు ఎంత నీరు త్రాగాలి అనే ప్రశ్న చాలా మందికి గందరగోళం కలిగిస్తుంది. వైద్యులు కూడా నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు.  వేసవిలో ఎంత నీరు తాగాలి అనే విషయం తెలుసుకుంటే చాలా మంది చాలా సమస్యల నుండి బయటపడతారు.  ఇంతకీ వేసవిలో ఎన్ని నీరు తాగాలి తెలుసుకుంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో పెద్దలు సాధారణంగా రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలని సలహా ఇస్తారు. అంటే ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలి. అయితే, ఈ పరిమాణం వ్యక్తి శారీరక శ్రమ, వాతావరణం,  ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.  ఎక్కువ వ్యాయామం చేస్తే లేదా శారీరకంగా కష్టతరమైన పని చేస్తే ఎక్కువ నీరు త్రాగవలసి ఉంటుంది. అలాగే వేడి వాతావరణంలో నివసించే ప్రజలు ఎక్కువ నీరు త్రాగాలి.

తక్కువ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు..

నీరు మన శరీరానికి ఇంధనం లాంటిదని అందరికీ తెలుసు. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది, ఇవి చిన్న సమస్యల నుండి ప్రారంభమై తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. ఆ సమస్యలు ఏంటంటే..

డీహైడ్రేషన్..

నీరు లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. చాలా సార్లు డీహైడ్రేషన్ కారణంగా మూర్ఛపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే  ప్రతి వ్యక్తి వేసవి కాలంలో ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి.

జీర్ణ సమస్యలు..

జీర్ణక్రియకు నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు త్రాగడం వల్ల మలబద్ధకం రావడం చాలా సాధారణం. అదనంగా గ్యాస్, ఉబ్బరం,  అజీర్ణం వంటి పొట్ట సమస్యలు కూడా పెరగవచ్చు.

మూత్రపిండాలపై ప్రభావం..

మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. మూత్రపిండాల పనితీరులో  నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్ర ఇన్ఫెక్షన్ల  ప్రమాదం పెరుగుతుంది.  దీనిని నివారించడానికి, జుకు 2-3 లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలి.


                                    *రూపశ్రీ

 

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

 

By
en-us Political News

  
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.