Publish Date:Mar 25, 2023
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. అలాగే జగన్ కు ఉన్న అసంఖ్యాక సలహాదారులు చేస్తున్న పనేంటని నిలదీశారు. అసలు జగన్ వై నాట్ 175 అని ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. పార్టీ అధినాయకత్వం వద్దకు తన వంటి సీనియర్లు వెళితే కూడా పలకరించే దిక్కు లేదన్నారు. ఎమ్మెల్యేలకు సీఎం గౌరవం ఇవ్వడంలేదన్నారు. సీఎంకు పెద్ద సంఖ్యలో ఉన్న సలహాదారులు చేసే పనేంటో కూడా ఎవరికీ తెలియదని మేకపాటి అన్నారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు అది వద్దని జగన్ తో చెప్పాను" అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. దాదాపు 50 మంది వరకూ ఎమ్మెల్యేలు పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/how-jagan-can-say-why-not-25-152915.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.