అమరావతి గ్రామాల్లో పేదలకు లక్ష ఇళ్లు.. జగన్ వ్యూహం అదేనా?

Publish Date:Nov 2, 2022

Advertisement

ఏపీ సీఎం తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు విషయంలో అదే చేశారు.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రైతుల పాదయాత్రను ఆపడానికి విశాఖ గర్జన పేర చేసిందీ అదే. ఇప్పుడు మరో భయంకరమైన కుట్ర రాజకీయానికి తెర లేపారు. అది కూడా పేదలకు ఇళ్లు అంటూ అమరావతి రైతులను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలకు దూరం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

ఇందు కోసం ఆయన కోర్టు తీర్పును ఖాతరు చేయడం లేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. అన్నిటికీ మించి ప్రాంతాల మధ్య చిచ్చు రగిలి రాష్ట్రం రావణ కాష్టం అయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నా లెక్క చేయడం లేదు. ఇంతకీ..ఆయన ఇప్పుడు కొత్తగా రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చడానికి వేసిన ఎత్తేంటంటే.. సకల విలువలకూ తిలోదకాలిచ్చేసి, కోర్టు తీర్పును సైతం బేఖాతరు చేసి.. సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసి మరీ అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు అంటున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులకు సైతం ప్రకటన ఇచ్చేశారు. ఇందులో మతలబు ఏమిటంటే రాజధాని అమరావతి ప్రాంతంలో బయట వారికి స్థలాలు కేటాయించడానికి వీల్లేదని సీఆర్డీయే చట్టం చెబుతోంది.

సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. దానిపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు సైతం వెళ్లింది. అక్కడ ప్రభుత్వ పిటిషన్ విచారణ వాయిదా పడింది.   సుప్రీం కోర్టు డైరెక్షన్ వచ్చే వరకూ హైకోర్టు తీర్పును కాదని జగన్ సర్కార్ ఏ విధంగానూ ముందడుగు వేయడానికి వీల్లేదు. అయితే జగన్ రూటే సెపరేటు. కోర్టు తీర్పును బేఖాతరీ చేసి రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక జోను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. రాజధాని పరిధిలో ఉన్న ఐదు గ్రామల్లో 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇందు కోసం సీఆర్డీయే చట్టంలో సవరణ చేసింది. ఆ సవరణ మేరకే జోన్ ఏర్పాటు చేస్తూ  నోటిఫికేషన్ ఇచ్చింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో, అలాగే తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోనూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనడమే కాకుండా ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేస్తూ నోటిఫికేషన్ కూడా జగన్ సర్కార్ ఇచ్చేసింది.

జోనింగ్లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేసేందుకు   అక్టోబరు 28వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. అభ్యంతరాలు సూచనలను   సీఆర్డీఏ కార్యాలయంలో లేదా ఈమెయిల్ లేదా  ఫోన్ ద్వారా  తెలియచేయవచ్చని తెలిపింది.   రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనువుగా మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేసేందుకు స్థానిక సంస్థల పాలకవర్గాలకు, ప్రత్యేక అధికారులకు అధికారాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ఇటీవలే చేసిన సీఆర్డీఏ చట్ట సవరణకు  అనుగుణంగా ఈ   నోటిఫికేషన్ జారీ చేశారు.
 నిజానికి ఈ వ్యవహారానికి జగన్ సర్కార్ గత ఏడాదే తెరలేపింది.

రాజ‌ధాని అమరావతి పరిధిలో పేదలకు   భూములు కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ల‌బ్ధిదారుల‌    ఎంపిక కూడా పూర్తి చేసింది.  అయితే.. తాము రాజ‌ధాని కోసం ఇచ్చిన భూముల‌ను పేద‌ల‌కు ఇవ్వ‌డం కూడదంటూ రాజ‌ధాని రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై  కోర్టు అలా చేయ‌డానికి వీల్లేద‌ని విస్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను మార్పు చేస్తూ.. స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఇది కూడా కోర్టు ధిక్కరణేనని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎవరూ అడ్డు చెప్పరు కానీ, అమరావతి పరిస్థితులు వేరు అన్నది గుర్తించాలని న్యాయనిపుణులు అంటున్నారు.  రాజధాని కోసం ఏ ప్రాంతంలో ఏది నిర్మిచాలనే నిర్ణయాన్ని కాదని ఇష్టారీతిగా జీవోలు ఇచ్చి అమరావతిని నిర్వీర్యం చేసేందుకుజగన్ సర్కార్  కోర్టు ధిక్కరణకు సైతం వెనుకాడటం లేదనడానికి ఇది తాజా తార్కాణమని అంటున్నారు.  

ప్రభుత్వ తాజా మూవ్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందనీ, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు లంక దినకర్ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోక తప్పదని హెచ్చరించారు. ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘిస్తోందని అన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో జగన్ సర్కార్ ఇప్పుడు చేసిన మార్పు ఏపీ హైకోర్టు తీర్పు ఉల్లంఘనేనని పేర్కొన్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.