Publish Date:Apr 11, 2026
ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్ ప్లాజా వద్ద ఈరోజు శనివారం (ఏప్రిల్ 11) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు మరణించారు. టోల్ ప్లాజా వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ ఓ కారుపై బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఇన్‌కమింగ్ ప్రెసిడెంట్ ప్రభునాథ్ వాసిరెడ్డి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకుడు మాధవరావు నల్లూరి, న్యాయవాది రవితేజ పదిరి శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.
శ్రీనివాస్ రావుకు ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/horrific-road-accident-36-217168.html
జెన్ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!
నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శెహభాష్..లోకేష్` అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భుజం తట్టారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతలు వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అనిల్ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!