జూబ్లీహిల్స్‌లో హనీ ట్రాప్ కలకలం.!
Publish Date:Sep 29, 2026
Advertisement
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.! హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో హనీ ట్రాప్ తరహా మోసం కలకలం రేపింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి ఓ వ్యక్తిని పబ్‌కు తీసుకెళ్లి భారీగా బిల్లు వేసి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా హేమంత్‌కు దివ్య అనే యువతి పరిచయమైంది. అనంతరం ఇద్దరూ మాట్లాడుకోవడంతో దివ్య హేమంత్‌ను జూబ్లీహిల్స్‌లోని 36 కెమిస్ట్రీ పబ్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పబ్‌లో కొంత సమయం గడిపిన అనంతరం హేమంత్‌కు రూ.29,000 భారీ బిల్లు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బిల్లు చెల్లించే సమయంలో పబ్ యాజమాన్యంతో కలిసి ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చూపించి తనను మోసం చేసినట్లు హేమంత్ ఆరోపించారు. పబ్ సిబ్బంది, దివ్య కలిసి ముందస్తు పథకం ప్రకారం తనను మోసం చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లో జరిగిన వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బిల్లింగ్ వివరాలు, పేమెంట్ ట్రాన్సాక్షన్‌లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి పాత్రతో పాటు పబ్ యాజమాన్యం లేదా సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. [ Honey Trap, Jubilee Hills, Dating App, Pub Bill, ₹29,000 Bill, Hyderabad Crime, Quack Quack Dating App, Hemant, Divya, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police ]
http://www.teluguone.com/news/content/honey-trap-25-232914.html





