హోం మంత్రి పవన్ కల్యాణ్?!.. రఘురామకృష్ణం రాజు హింట్ అదేనా?
Publish Date:Jun 30, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం మంత్రి మార్పు జరగనుందా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారా అంటే.. రాజకీయవర్గాలు ఔననే అంటున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నాయి. అసలీ చర్చకు మూలం ఏమిటంటే.. గత వారం ఒక బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరగాళ్లు చాలా అదృష్టవంతులన్నారు. తాను రాష్ట్ర హోం మంత్రి కాకపోవడం వల్లే నేరస్థఉలు స్వేచ్ఛగా తిరుగుతున్నారనీ, ఒకవేళ తానే గనుక హోం మంత్రిని అయి ఉంటే నేరగాళ్ల ఆటలు సాగేవి కావని పవన్ అన్నారు. పవన్ మాటలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. ఇక పవన్ వ్యాఖ్యలపై తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడరనీ, ఆయన తాను హోంమంత్రిని అయితే.. అంటూ పవన్ అన్నారంటూ.. ఆయన ఆ పదవి చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లేనంటూ రఘురామకృష్ణం రాజు అన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హోంమంత్రిగా పవన్ కల్యాణ్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారన్న సమాచారం నేపథ్యంలో హోంమంత్రి మార్పు తథ్యమన్న చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది. పవన్ కళ్యాణ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే.. ఆయన దూకుడు, పారదర్శకమైన శైలి కారణంగా రాష్ట్ర శాంతిభద్రతల విభాగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఆయన చూపే చొరవ రాష్ట్రంలో నేర నియంత్రణకు నిస్సందేహంగా దోహదపడుతుం దని అంటున్నారు. హోం శాఖ వంటి అత్యంత సున్నితమైన, కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించడానికి అవసరమైన ఓర్పు పవన్ కు ఉందా అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/home-minister-pawan-kalyan-39-224584.html





