పరామర్శల పేరుతో బలప్రదర్శనలా?

Publish Date:Aug 6, 2026

Advertisement

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.  పరామర్శల పేరుతో వైసీపీ అధినేత  జగన్   రాజకీయం చేస్తున్నారంటూ  హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. పరామర్శను  రాజకీయ బలప్రదర్శనకు వాడుకోవడం ఎంతమాత్రం తగదని మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   , జగన్ మోహన్ రెడ్డి పర్యటనల వెనుక ఉన్న అసలు నైజాన్ని వంగలపూడి వనిత  ఎండగట్టారు. జగన్ బయటకు అడుగు పెడితే విధ్వంసాలు, అరాచకాలు చోటుచేసుకుంటున్నాయని, అసలు ఈ రకమైన పర్యటనల ద్వారా సమాజానికి ఆయన ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  తన విమర్శలకు బలం చేకూరుస్తూ..  జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను   వంగలపూడి అనిత ఈ సందర్భంగా  ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి  అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం  నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.   క్రికెట్ లేదా ఇతర ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని  ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహావిష్కరణ మహోత్సవానికి జగన్ స్వయంగా హాజరవడం ఏ రకమైన సంకేతమని ఆమె ప్రశ్నించారు.  

వైసీపీ నేతలు,  కార్యకర్తలు   బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారన్న అనిత,  జగన్ పర్యటన సందర్భంగా ఒక వ్యక్తి ఆయన కారు కింద పడినా కనీసం పట్టించుకోకుండా, మానవత్వం లేకుండా కారును ఆపకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. ప్రజా రవాణాకు, అత్యవసర వైద్య సేవలకు  విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆసుపత్రికి తరలించే అంబ్యులెన్స్‌లకు సైతం దారి ఇవ్వకుండా వైసీపీకార్యకర్తలు రహదారులపై హంగామా చేస్తూ ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. పరామర్శల పేరుతో రోడ్లపైకి వస్తున్న సమయాల్లో అమాయక మహిళలపై దాడులు జరగడం, విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నాలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు వంగలపూడి అనిత. 

జగన్  ఈ తరహా పరామర్శల పేరిట నిర్వహిస్తున్న రాజకీయ బలప్రదర్శనల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు అమాయకులు   ప్రాణాలను కోల్పోయారన్న హోంమంత్రి,   తన రాజకీయ ప్రయోజనాలు, ఉనికి కాపాడుకోవడం కోసమే ప్రజా సంక్షేమాన్ని, శాంతిభద్రతలను పక్కనబెట్టి వైకాపా నేతలు ఇలాంటి అరాచక పర్యటనలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన తీరు  మార్చుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలని, ప్రజల ప్రాణాలతో ఆడుకునే రాజకీయాన్ని స్వస్తి చెప్పాలని హెచ్చరించారు.

Home Minister Anitha, YS Jagan Mohan Reddy, AP Home Minister Anitha, YSRCP Paramarsha Yatra, Anitha Slams Jagan, AP Politics News

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.