హిమదాస్ గురించి చదివితే మీ జీవితం మారిపోతుంది
Publish Date:Jul 17, 2018
Advertisement
హిమదాస్. నిన్నమొన్నటి వరకు ఆ పిల్ల ఎవరికీ తెలియదు. ఇప్పుడూ... ఆపేరు వినని వాళ్లు చాలా రేర్‌గా కనిపిస్తారు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు హీనాది ఓ ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరూ అంతర్జాతీయస్థాయి పరుగుపోటీల్లో బంగారుపతకం సాధించలేదు. పీటీ ఉష, అశ్వనీ నాచప్పలాంటి వాళ్లు కూడా సాధించలేనిది ఈ హీనా ఎలా గెల్చుకుందో తెలుసుకోవాలంటే... ఆమె జీవితాన్ని ఓసారి చూడాల్సిందే! హిమదాస్‌ది అసోంలో శివసాగర్ అనే పల్లెటూరు. అక్కడ హిమ వాళ్ల నాన్న చిన్న రైతు. తన పిల్ల ఏదో కాస్త చదువుకుంటే చాలనుకునే మనస్తత్వం. హిమకి మాత్రం అటు చదువు, ఇటు వ్యవసాయం కంటే ఆటల మీదే శ్రద్ధ ఉండేది. ఎంత శ్రద్ధ అంటే మగపిల్లలతో కలిసి పొలాల పక్కనే ఉండే బురదలో తెగ ఫుట్‌బాల్ ఆడేది. ఆటలో పడితే ప్రపంచాన్నే మర్చిపోయేది. అలాంటి సమయంలో ఓ లోకల్ కోచ్ హీనాని చూశాడు. తను ఫుట్‌బాల్లో కంటే రన్నింగ్‌లో మరింత బాగా రాణించగలదనుకున్నాడు. వెంటనే హీనాని ఒప్పంచి రన్నింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వసాగాడు.
హిమ క్రమంగా రన్నింగ్‌లో రాటుదేలింది. జిల్లా స్థాయిలో మెడల్స్ తెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఆ సమయంలోనే నిపాన్ అనే కోచ్ దృష్టి హిమ మీద పడింది. చవక బూట్లు వేసుకుని కూడా, హిమ గోల్డ్ మెడల్స్ సాధించడం చూసి ఆశ్చర్యం వేసింది. తను ఇంతకుముందు ఎప్పుడూ చూడని టాలెంట్ హిమలో ఉందని నిపాన్ గ్రహించాడు. వెంటనే హీనాకి ప్రభుత్వ కోచింగ్ ఇప్పించాలని అనుకున్నాడు. గవర్నమెంట్ కోచింగ్ తీసుకోవాలంటే అసోం రాజధాని గువాహతికి పంపించాలి. అది హిమ తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆడపిల్ల, అందులోనూ ఆరుగురు పిల్లల్లో అందరికంటే చిన్నది. అందుకే హిమని అంతదూరం పంపడానికి వాళ్ల మనసు ఒప్పలేదు. కానీ హీనాని వాళ్లు గువాహతికి పంపేదాకా నిపాన్ ఊరుకోలేదు.
తీరా గువాహతికి వెళ్లాక అక్కడ అథ్లెటిక్స్ కోసం ప్రత్యేక కోచింగ్ లేదని తెలిసింది. అయినా హిమ వెనక్కి రాలేదు. ఆమె ప్రతిభ చూసిన అధికారులు కూడా హిమని అకాడెమీలోకి తీసుకోక తప్పలేదు. ఓ రెండేళ్లు తిరిగేసరికి... ఇదిగో ఇలా చరిత్రి సృష్టించింది. ఫిన్లాండ్‌లో జరిగిన ‘world championships’లో గోల్డ్ మెడల్ కొట్టింది.
హిమ గోల్డ్ మెడల్ సాధించిందని తెలిసి దేశం ఆశ్చర్యపోయింది. కానీ ఆమె సంపాదిస్తుందని ఆమె కోచ్ నిపాన్‌కు ఎప్పుడూ తెలుసు. ‘చాలా కొద్దిమందిలోనే టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్లలో హీనా ఒకరు. అందుకే ఆమెను ఎప్పుడూ చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకోవద్దని చెబుతూ ఉంటాను,’ అంటాడు నిపాన్. మనకి నచ్చిన రంగం ఏదైనా సరే... దాని మీదే effort పెడితే ఎప్పటికైనా విజయం తప్పదని హీనా నిరూపిస్తోంది. దేని మీదైనా మనకి విపరీతమైన dedication ఉంటే, పరిస్థితులన్నీ కలిసి వస్తాయని హీనా కథతో తెలుస్తోంది. - Nirjara
http://www.teluguone.com/news/content/hima-das-35-82503.html