హిల్లరీ క్లింటన్‌ అనారోగ్యంగా ఉన్నారా?

Publish Date:Aug 17, 2016

Advertisement

 

ఈసారి జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు బహుశా ఎప్పుడూ లేనంతగా ప్రచారం జరుగుతోంది. రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్‌ హోరాహోరీగా పోరాడుతున్నారు. ట్రంప్‌ తన దూకుడు మాటలతో ఇప్పటికే ప్రపంచాన్ని ఆకర్షిస్తే... అమెరికా చరిత్రలోనే తొలి మహిళా అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఈ హోరాహోరీ ఎన్నికలలో పై చేయిని సాధించేందుకు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అభ్యర్థులు. వాటిలో ఈ మధ్యకాలం వార్తల్లోకి వస్తున్న అంశం... హిల్లరీ క్లింటన్‌ ఆరోగ్యం!

 

ఇదీ ఆరోపణ

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న హిల్లరీ క్లింటన్ అప్పుడప్పుడూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నది ఆరోపణ. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా స్తబ్దుగా నిలబడిపోవడం, మాట ఒకోసారి తీవ్రంగా తడబడటం, బెదురు చూపులు చూడ్డం వంటి పనులు చేస్తున్నారట. ఒక సందర్భంగా అయితే ఫిట్స్‌ వచ్చిన మనిషిలాగా తలని ఊపడంతో చుట్టుపక్కలవారందరూ కంగారుపడ్డారు.

 

హిల్లరీ ఇలా చిత్రంగా ప్రవర్తించిన వీడియోలు ఇంటర్నెట్‌లో చాలానే కనిపిస్తున్నాయి. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారన్నది ఆరోపణ. హిల్లరీ ఉపన్యాసం ఇచ్చిన ప్రతిసారి వెళ్లి విశ్రాంతి తీసుకోక తప్పదంటూ ట్రంప్‌ వ్యాఖ్యనించారు కూడా!

 

ఇదీ నేపథ్యం

2012లో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఒకసారి హిల్లరీకి జ్వరం సోకింది. జ్వరం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆమె ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఆ స్థితి నుంచి పూర్తిగా కోలుకోవడానికి హిల్లరీకి ఆరు నెలల సమయం పట్టిందంటూ సాక్షాత్తూ ఆమె భర్త బిల్‌ క్లింటన్ పేర్కొన్నారు. ఎవరన్నా ఇలా ఎక్కువసేపు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోతే వాళ్ల మెదడు దెబ్బతినే అవకాశం ఉంది కదా! అన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అనుమానం.

 

ఇదీ జవాబు!

హిల్లరీ క్లింటన్‌ ఏమీ చిన్నపిల్ల కాదు. 69 ఏళ్ల మనిషి. ఆ మాటకు వస్తే హిల్లరీ ప్రత్యర్థి ట్రంప్‌కు 70 ఏళ్లు! ఈ వయసులో చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అంతమాత్రం చేత ఏవేవో ఊహించేసుకుని ఆమెను అభాసుపాలు చేయడం మంచిది కాదంటున్నారు హిల్లరీ అభిమానులు. హిల్లరీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉందని, గత అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుందనీ.. ఆమె వ్యక్తిగత వైద్యురాలైన లీసా బార్డాక్‌ హామీ ఇస్తున్నారు. అది నిజమేననీ, హిల్లరీ సంపూర్ణ ఆరోగ్యంతో అమెరికా అధ్యక్షపదవిని చేపట్టి చరిత్రను సృష్టించాలన్నది ఆమె అభిమానుల ఆకాంక్ష!

 

 

- నిర్జర.

By
en-us Political News

  
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.