నెల్లూరు లో టెన్షన్.. టెన్షన్

Publish Date:Jul 31, 2025

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి   జగన్  గురువారం (జులై 31) నెల్లూరు పర్యటన సందర్భంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాపర్ట్ లో  బయలుదేరిన జగన్   నెల్లూరు జైలుకు చేరుకుని అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. అనంతరం ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెడతారు.

 కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్దకు పది మందికి మాత్రమే అనుమతించారు. అలాగే జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ములాఖత్ కు జగన్ సహా ముగ్గురికి మాత్రమే అనుమతి ఇచ్చారు.  ఇక జగన్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లనున్నారు. అక్కడకు జగన్ తో పాటు వంద మంది మించి ఉండరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆంక్షల ఉల్లంఘనకే సిద్ధమయ్యారు. ఇప్పటికే వారు కార్యకర్తలను తాము కట్టడి చేయలేమని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు వ్యాప్తంగా హై టెన్షన్ నెలకొంది.  నెల్లూరు పర్యటన ముగించుకున్న తరువాత జగన్ నేరుగా అక్కడి నుంచే బెంగళూరుకు వెడతారు.   

కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అయితే వైవసీపీ శ్రేణులు మాత్రం ఆంక్షలను ఖాతరు చేయకుండా.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. అలాగే నెల్లూరు జైలు వద్ద కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గుమిగూడారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందా అన్న టెన్షన్ సర్వత్యా కనిపిస్తోంది.  

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.