ఏపీలో పోలీస్ రాజ్యంపై హైకోర్టు ఆగ్రహం.. అరెస్టులు, రిమాండ్లపై మొట్టికాయలు
Publish Date:Mar 8, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్’ లో అరాచక పాలాన ఏ స్థాయిలో జరుగుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఒక ఎంపీ.. అది కూడా అధికార పార్టీ ఎంపీ, సొంత నియోజక వర్గంలో పర్యటించలేని భయానక వాతావరణం రాష్ట్రంలో నెలకొందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. నిజమే, ఎంపీ సొంత నియోజక వర్గంలో పర్యటించలేని పరిస్థితులు మాత్రమే కాదు, ఎంపీని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే పోలీసు వ్యవస్థ, ఎంపీ హత్యకు పోలీసులే కుట్ర చేశారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికార యంత్రాంగం, వ్యవస్థ ఉన్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదంటే, ఆశ్చర్య పోనవసరం లేదు. నిజానికి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులకు, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్చకు రక్షణ లేకుండా పోయిందనే మాట వినవస్తూనే వుంది. మీడియాలో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినా, ఒక అభిప్రాయం వ్యక్తం చేసినా అది నేరం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అభిప్రాయం, ఆందోళన సర్వత్రా వినవస్తోంది. ఇందుకు సంబంధించి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు ప్రసారం చేశారనో పోలీసులు కేసులు పెట్టడం. ప్రజలను వేధింపులకు గురిచేయడం జరుగుతోందని అనేక విమర్శలున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును ఆక్షేపిస్తూ, టీవీ 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాలను వెల్లడించకుండా అరెస్టులు, రిమాండ్లు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. 167 సీఆర్పీకసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఉమేష్ చంద్ర వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పోలీసుల చర్యలను పరిగణనలోకి తీసుకోకుండానే రిమాండ్ విధించడం హక్కులను భంగపర్చడమేనని, అభియోగాల వివరాలు నిందితలను తెలియజేకపోవడం చట్ట ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. ఏపీలో ఇష్టారీతిన రిమాండ్లుల విధించడం కుదరదని హైకోర్టు తెలిపింది. దిగువ స్థాయి జడ్జిలు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దిగువ కోర్టుల మెజిస్ట్రేట్లు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని, ఎఫ్ఐిఆర్ నమోదైన 24 గంటల్లో అప్లో్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఎలాపడితే అలా కేసులు పెడితే కుదరదని వార్నింగ్ ఇచ్చింది. విచక్షణ లేకుండా రిమాండ్కు ఆదేశిస్తే బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలని హైకోర్టు పేర్కొంది. కాగా, హైకోర్ట్ ఉత్తర్వులను నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్వాగతించారు.
http://www.teluguone.com/news/content/high-court-serious-on-ap-policing-39-132760.html





