సీడ్ యాక్సిస్ రోడ్డు కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.!
Publish Date:Jul 21, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన న్యాయ వివాదంలో ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అమరావతి రాజధాని నగరాన్ని అనుసంధానించే కీలక రవాణా మార్గంగా ప్రతిపాదించిన ఈ రహదారి భూసేకరణ వివాదంపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అలాగే.. తుది తీర్పు వెలువడే వరకు వివాదాస్పద భూముల్లో స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్రనాథ్ తిలకరి , జస్టిస్ చింతలపూడి పురుషోత్తంకుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన చోడిశెట్టి నిర్మలత అనే రైతు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం తన పరిధిలోని భూమిని సేకరించే సమయంలో సంబంధిత అధికారులు చట్టబద్ధమైన నిబంధనలను, భూసేకరణ చట్టాల మార్గదర్శకాలను స పాటించలేదని ఆమె తన పిటిషన్ లో ఆరోపించారు. రైతులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన హక్కులు, పరిహార చెల్లింపుల ప్రక్రియలు, భూసేకరణ నోటిఫికేషన్ నిబంధనల అమలులో లోపాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజధాని పరిధిలో కీ రవాణా వ్యవస్థకు సీడ్ యాక్సెస్ రోడ్డు వెన్నెముక వంటిదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఈ కీలక రహదారి నిర్మాణం నిలిచిపోయిందని, దీనివల్ల రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు జాప్యమౌతోందని పేర్కొన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే మధ్యంతర స్టే ఎత్తివేయాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ అంతా చట్టబద్ధంగా, పారదర్శకంగానే సాగిందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పెనుమాక గ్రామ పరిధిలోని వివాదాస్పద భూములకు సంబంధించి చట్ట ప్రకారం అనుసరించాల్సిన అన్ని రకాల ప్రక్రియలను నెరవేర్చామన్న ఆయన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేపడుతున్న రహదారి పనులకు ఆటంకం కలగకుండా స్టే తొలగించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. Penumaka Land Acquisition Case, Dammalapati Srinivas AG, Amaravati Capital Roads, AP High Court Status Quo
http://www.teluguone.com/news/content/high-court-reserves-judgment-on-seedacces-road-case-36-226688.html





