బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హై కోర్టు ఓకే
Publish Date:Aug 25, 2022
Advertisement
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎటువంటి షరతులూ లేకుండా యాత్రను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ఆపాలంటూ పోలీసులు బండిసంజయ్ కు ఇచ్చిన నోటీసులను హైకోర్టు స్పస్పెండ్ చేసింది. యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టిన హై కోర్టు పాదయాత్రకు బేషరతు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని విఘ్నం కలిగేలా బండి సంజయ్ వ్యాఖ్యానించారంటూ యాత్ర నిలిపివేయాలని నోటీసులు ఇచ్చిన దానిపై ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను చూపాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం పెన్ డ్రైవ్ లో ఆధారాలను సమర్పించింది. అయితే పెన్ డ్రైవ్ ఆధారాలు చెల్లవన్న కోర్టు సరైన పద్ధతిలో ఆధారాలను సమర్పించకపోవడంపై ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. అనంతరం యాత్రకు అనుమతి తీసుకున్నారా అని బండి సంజయ్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. అందుకు తీసుకున్నామంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో బండి సంజయ్ యాత్రకు అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బండి సంజయ్ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై తెరాస శ్రేణులలోనే ఒకింత అసహనం వ్యక్తమైంది. ఎవరికీ పట్టని యాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేయడం వెనుక ప్రభుత్వ వ్యూహమేమి ముగింపు సభ పేర పార్టీ అగ్రనాయకులను తీసుకువచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు, ప్రసంగాలలో కొత్తదనమేమీ ఉండటం లేదు. కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతి అన్న ఊకదంపుడు విమర్శలను జనం పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బండి పాదయాత్ర వల్ల ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతోందంటూ యాత్రకు బ్రేక్ వేయడం ఎందుకో? దాని వెనక ఉన్న వ్యూహమేమిటో అర్ధం కావడం లేదని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అవసరం లేని ఆంక్షల వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. పైగా బండి సంగ్రామ యాత్ర దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఈ సమయంలో ఆ యాత్రను నిలిపేయాలంటూ నోటీసులు ఇవ్వడం వల్ల యాత్ర గురించి చర్చ జరుగుతుందనీ, అది బీజేపీకే ప్రయోజనకరమని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ యాత్రకు అనుమతి ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని అంటున్నారు.
టో అర్దం కావడం లేదని టీఆర్ఎస్ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నది సామెత. టీఆర్ఎస్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ సామెతనే గుర్తు చేస్తున్నది. బండి ప్రజా సంగ్రామ యాత్ర.. ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో కూడా రాష్ట్రంలో జనం పట్టించుకోవడం లేదు. విడతల వారీగా బండి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ నడుస్తున్నారు.
http://www.teluguone.com/news/content/high-court-green-signal-to-bandi-padayatra-25-142650.html





