Publish Date:Jul 19, 2022
అసలే పాలనా లోపాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ సర్కార్‌కు రిషికొండ రిసార్ట్ పునరుద్ధరణ కేసు తలకుచుట్టుకుంది. విశాఖలోని రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చట్టపరమైన అనుమతు లన్నీ తీసుకున్న తరు వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించామని, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలిపింది.
ఆర్థిక, పర్యాటక అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను అడ్డుకోవా లన్న దురుద్దేశంతోనే ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని పేర్కొంది. తప్పుడు ఆరోపణలతో దాఖలైన వ్యాజ్యాలను భారీ జరిమానాతో కొట్టి వేయాలని న్యాయ స్థానా న్ని అభ్యర్థించింది. జాతీయ హరిత ట్రిబ్యు నల్ (ఎన్‌జీటీ) నియమించిన నిపుణుల కమిటీ సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి చట్ట ఉల్లం ఘనలు జరగ లేదని తేల్చినట్లు గుర్తు చేసింది.
రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖ లయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు రఘురామ పిటీషన్ ను అనుమతించాలని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఆయన వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటిషన్ ను సి.జే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అనుమతించింది. రుషికొండలో పర్యవరణ ఉల్లంఘనలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యూనల్ కు రఘురామకృష్ణం రాజు లేఖ రాసిన సంగతి విదితమే. దీంతో రుషికొండపై తవ్వకాలు పర్యవరణ కాలుష్యంపై స్టే విధిస్తూ హరిత్ర ట్రిబ్యూలన్ ఆర్డర్ దీంతో దీనిపై ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ కు వెళ్ళింది.
సుప్రీకోర్టు దీనిపై స్పందిస్తూ దీనిపై ఏపి హైకోర్టులో పెండింగ్ ఉన్న పిటిషన్లతో ఇంప్లీడ్ అవ్వమని చెప్పింది. దాన్ని అనుసరించి ఇంప్లీడ్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశామని న్యాయవాది ఉమేష్ చంద్ర తెలిపారు. దీనిపై న్యాయస్ధానం స్పందిస్తూ అనుబంధ పిటిషన్ ను అనుమతించింది. కాగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని కోర్టు అన్నిపిటిషన్ల విచారణను ఈ నెల 27కు వాయిదావేసింది రఘురామ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన సి.జే నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-courd-admit-raghurama-implead-pitition-on-rishikonda-25-140081.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.