గజదొంగ వికాస్ సింగ్ అరెస్టు.. అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు

Publish Date:Jun 4, 2026

Advertisement

వికారాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు బయటపడటంతో మొత్తం జిల్లాలో సంచలనం నెలకొంది. నిందితుడు వికాస్ సింగ్‌ను వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

గత నెల 5న వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్‌లో జరిగిన చోరీ ఈ కేసుకు కీలక మలుపు అయ్యింది. రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి సుమారు ఒకటిన్నర తులాల బంగారం, అలాగే 2,10,000 రూపాయల నగదు అపహరించారు. ఉదయం ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రారంభంలో ఇది సాధారణ చోరీగా అనిపించినా, దర్యాప్తు సాగిన కొద్దీ ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పని అని తేలింది. పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గుర్తించారు. అతనే కరడు గట్టిన నేరచరిత్ర కలిగిన వికాస్ సింగ్ అని నిర్ధారించారు.

తరువాత పోలీసులు టెక్నికల్ సర్వైలెన్స్ ఆధారంగా అతని కదలికలను ట్రాక్ చేసి రైల్వే స్టేషన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన తర్వాత వికాస్ సింగ్‌ను గట్టిగా విచారించగా,  షాక్ ఇచ్చే విషయాలు బయట పడ్డాయి.  వికాస్ సింగ్ 16 ఏళ్ల వయస్సులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలతో మొదలైన అతని క్రైమ్ జర్నీ తరువాత భారీ చోరీల వరకు వెళ్లింది. గతంలో సంగారెడ్డి, బొల్లారం ప్రాంతాల్లో మొత్తం 34 కేసుల్లో అతని పేరు నమోదై, జైలు శిక్ష కూడా అనుభవించినట్లు ఎస్పీ తెలిపారు.అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత పద్ధతిగా క్రైమ్ మోడల్‌ను రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. వికారాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో గత నెల 27 రాత్రి నుంచి వరుసగా ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళల్లో మాత్రమే ఆపరేషన్ చేస్తూ, తాళం వేసి ఉన్న ఇళ్లనే ఎంచుకోవడం అతని ప్రత్యేకతగా గుర్తించారు.ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, దొంగతనాల ద్వారా సంపాదించిన సొత్తును వికాస్ సింగ్ కేవలం ఖర్చు చేయడమే కాకుండా,  హెల్పింగ్ హ్యాండ్స్  పేరుతో ఒక ఎన్జీవోను ప్రారంభించినట్లు విచారణలో బయటపడింది. బయటకు సామాజిక సేవా సంస్థలా కనిపించినా, లోపల మాత్రం దొంగతనాల సొత్తు మళ్లించడానికి ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ కేసులో మరో కీలక కోణం కూడా బయటపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బంగారు నగల వ్యాపారులు శ్యామ్ మోసెస్, సూరజ్ మోహన్, అశోక్ సోనీ, వికాస్ అగ్రహారి వంటి వారు వికాస్ సింగ్‌ను దొంగతనాలకు ప్రోత్సహించడంతో పాటు అతనికి తుపాకీ కూడా సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది కేసును మరింత తీవ్రమైన అంతర్రాష్ట్ర క్రిమినల్ నెట్‌వర్క్ వైపు మళ్లించింది.పోలీసులు వికాస్ సింగ్ వద్ద నుంచి దొంగిలించిన బంగారంతో పాటు ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన నెట్‌వర్క్ మొత్తం బయటకు తీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక దొంగతనం కేసుగా కాకుండా, అంతరాష్ట్ర గ్యాంగ్ నెట్‌వర్క్ దిశగా దర్యాప్తు సాగుతోంది

By
en-us Political News

  
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.