అర్ధరాత్రి సాగర్ వద్ద హైడ్రామా.. ఎన్నికల వేళ ఎందుకిలా?

Publish Date:Nov 30, 2023

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్ద రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు, వందల మంది పోలీసులు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక రాష్ట్రం పోలీసులు గేటు వేసి అడ్డుకుంటే.. మరో రాష్ట్రం పోలీసులు ఫెన్సింగ్ వేసి అడ్డుకున్నారు. ఈ ఉద్రిక్తతతలు ఘర్షణకు దారి తీయడంతో  డ్యామ్ సిబ్బందికి గాయాలయ్యాయి. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒకవైపు తెల్లవారితే తెలంగాణలో ఎన్నికలు, అలాంటి వేళ సరిగ్గా అర్ధరాత్రి వేళ హైడ్రామా నెలకొనడంతో అసలేం జరుగుతోందన్న అయోమయం ఏర్పడింది.  ఇరు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి కావడంతో వందల మంది పోలీసులు మోహరించడంతో  ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎన్నికలలో లబ్ది కోసమే కేసీఆర్ అర్ధరాత్రి సమయంలో హైడ్రామాకి తెర తీసారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ కూడా అదే ఆరోపణ చేస్తోంది. ఆ ఆరోపణలు అలా ఉంచితే ఇంతకూ అసలేం జరిగిందంటే.

తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు ఏపీ పరిధిలో ఉండగా మిగతా సగభాగం తెలంగాణలో ఉంది. కాగా  ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఇదే సమయంలో డ్యామ్‌ ఆపరేషన్ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో సాగు, తాగు నీటికి కృష్ణా డెల్టాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగు నీరు అందడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాగు, సాగు నీరు అందక గుంటూరు, పల్నాడు రైతాంగం కొద్ది రోజులుగా ఆందోళన   చేస్తోంది. అసలు రెండు రాష్ట్రాలకు వాటాలు ఉన్న ప్రాజెక్టును ఒకే రాష్ట్రానికి యాజమాన్య బాధ్యతలను అప్పగించడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.

దీంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ అధికారులు భారీ ఎత్తున పోలీసులను వెంటపెట్టుకొని నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్దకు చేరుకొని ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని, అక్కడ వరకు కంచె వేశారు. ఏపీ అధికారులు పోలీసులను డ్యామ్ సిబ్బంది గేట్ వేసి అడ్డుకోగా.. డ్యామ్ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా డ్యామ్ సిబ్బంది మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మిర్యాలగూడ డీఎస్పీ ఏపీ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వినలేదు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని కోరారు. ఏపీ పోలీసుల నుండి స్పందన లేకపోవడంతో తెలంగాణ పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఘటనా స్థలంలో మీడియా కవరేజీకి ప్రయత్నించగా పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి మీడియా ప్రతినిధుల ఫోన్లను కూడా లాక్కున్నారు. 

అయితే, అర్ధరాత్రి వేళ ఏపీ పోలీసులు దౌర్జన్యంగా చొరబడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ముందే ప్రక్కా ప్రణాళికతో 600 నుండి 700 మంది పోలీసులు ప్రాజెక్టుపైకి వెళ్లారు. నిజానికి ఈ ప్రాజెక్టు, అందులో నీటి వాటాలు, ప్రాజెక్టు నిర్వహణ ఇవన్నీ కేంద్ర పరిధిలోని అంశాలు. మహా అయితే రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అంశాలు. కానీ, వందల మంది పోలీసులతో వెళ్లి ప్రాజెక్టు వద్ద బీభత్సం సృష్టించడం వలన ఒరిగేది ఏమీ లేదు. పైగా సిబ్బందిపై దాడి, సీసీ కెమెరాల ధ్వంసం వంటి చర్యలతో ప్రజల సొమ్మే నష్టపోయింది. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం చూస్తే.. ఇది కావాలని పక్కా ప్రణాళికతో చేసిన చర్యగానే కనిపిస్తుంది. దౌర్జన్యకాండతో ఫలితం లేదని తెలిసినా.. పోలీసులే పనిగట్టుకొని వెళ్లి అల్లర్లు జరిగేలా ప్రేరేపించడం వెనక  పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను ప్రభావం చేయాలన్న దురుద్దేశమేదో ఉందన్న అనుమానాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం ఊరుకుని సరిగ్గా తెలంగాణ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం ఈ రకమైన దూకుడు ప్రదర్శించడం పొరుగు రాష్ట్రంలో తన మిత్రుడికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికేనని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్ చేసిన ఈ చర్య వల్ల ఇటు ఏపీలో జగన్ సర్కార్ రైతాంగం సమస్యల పట్ల పొరుగు రాష్ట్రంతో గొడవకు సైతం వెనుకాడటం లేదన్న  భావన ప్రజలలో కలిగేలా చేయడంతో పాటు.. పొరుగు రాష్ట్రంలో  సెంటిమెంట్ ను రగిల్చి అక్కడి తన మిత్రుడికి లబ్ధి చేకూర్చాలన్న కుట్ర కూడా దాగి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ సాగర్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడేలా జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు రాజకీయ కుట్రేనని అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.