Publish Date:May 24, 2023
రాజులు పోయారు.. రాచరికపు వ్యవస్థ పోయింది. కానీ ఏపీలో మాత్రం కొత్త రాచరిక వ్యవస్థ దివ్యంగా అలరారుతోంది. ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు నాటి ఆడంబరాలను గుర్తుకు తేవడమే కాదు.. రాచరికపు దర్పాన్నీ, సామాన్యులను ఇక్కట్ల పాలు చేసే అహంకారాన్నీ ప్రతి బింబిస్తున్నాయి. కొన్ని గంటల సీఎం పర్యటన కోసం ఏళ్ల నాటి చెట్లను నరికేస్తున్నారు.
ఆయన పర్యటన మార్గంలో ట్రాఫిక్ ను స్తంభింప చేస్తున్నారు. దుకాణాలను మూసేస్తున్నారు. ఆంక్షల పేరుతో గంటల తరబడి సామాన్యులకు నరకం చూపిస్తున్నారు. అందుకే సీఎం పర్యటన అంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఏపీ సీఎం గుంటూరులో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా విధించిన ఆంక్షలు సామాన్యులకు చుక్కలు చూపాయి. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ మాతృమూర్తి మరణించడంతో ఆయన్ను పరామర్శించేందుకు సీఎం బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు గుంటూరు వాసులను నానా ఇబ్బందులకూ గురి చేశాయి. పోలీసు కవాతు మైదానం, కలెక్టరేట్ కూడలి, కంకరగుంట బ్రిడ్జి, నగరంపాలెం కూడలి, పట్టాభిపురం, శ్యామలానగర్ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో బారికేడ్లను పెట్టారు.
సీఎం ఉదయం 8 గంటలకు గుంటూరు వస్తారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. సుమారు 9.30 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ పోలీసు కవాతు మైదానాన్ని చేరుకుంది. అక్కడినుంచి సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ను నిలిపేశారు. ముఖ్యమంత్రి తన పర్యటన ముగించుకొని తిరిగి పోలీసు కవాతు మైదానానికి సుమారు పదిన్నరకు చేరుకున్నారు. ఈ పర్యటన కోసం దాదాపు 4 గంటలపాటు నగరవాసులు ఇబ్బంది పడ్డారు.
ఈ ప్రాంతాల్లో ఉన్న ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులు క్షణమో యుగంలా గడిపారు. ఆయా మార్గాలను ఉన్నపళంగా మళ్లించడంతో స్థానికులు అష్టకష్టాల పాలయ్యారు. ఇక కొవ్వురులో కూడా ఇదే తంతు. కొవ్వురులో సీఎం పర్యటన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేజీఎం పాఠశాల సమీపంలో హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి రెండు కి.మీ. పరిధిలో పలుచోట్ల చెట్ల కొమ్మలు తొలగించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hell-to-common-man-with-restrictions-25-155830.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.