మరో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు
Publish Date:Aug 2, 2022
Advertisement
తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన రాష్ట్రం మరో నాలుగు రోజుల పాటు వరుణ ప్రతాపాన్ని చవి చూడాల్సి వస్తుంది. గత కొన్ని రోజులుగా దాదాపుగా ప్రతి రోజూ హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తేస్తూనే ఉంది. దానికి తోడు మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
http://www.teluguone.com/news/content/heavy-rains-for-another-four-days-39-141121.html





