తెలంగాణలో ఎండలు ప్రచండం.. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం

Publish Date:Apr 26, 2026

Advertisement

తెలంగాణ లో ఎండలు మండిపోతున్నాయి.  సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో  వడగాల్పులు వీస్తున్నాయి.  వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం ఈ వారంలో  రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గ  44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ  నమోదయ్యే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం , నల్గొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయి చేరే అవకాశాలున్నాయి.  ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందనీఆ సమయంలో  అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనీ  అధికారులు సూచిస్తున్నారు. ఇక   హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పెరిగిన తేమ కారణంగా ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణ ఆరోగ్య శాఖ  ప్రజలకు పలు సూచనలు చేసింది. నీరు ఎక్కువగా తాగాలనీ,  అలాగే ఓఆర్ఎస్,   మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలనీ సూచించింది. బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా గొడుగు ఉండాలనీ, లేదా కనీసం టోపీ ధరించాలని పేర్కొంది. ఇక నూనె వస్తువులు, మసాలా ఆహారానికి దూరంగా ఉండాలని పేర్కొంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం  ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. పని ప్రదేశాల్లో మంచినీటి సదుపాయం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

By
en-us Political News

  
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా స్పందించారు.
హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఇంధన సంక్షోభం మొదలైంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం.
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు.
కేవలం భౌతిక సరిహద్దులే కాకుండా.. సమాచారం, సాంకేతికత, సామాజిక సంబంధాల చుట్టూ కూడా నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థను బీజింగ్ సిద్ధం చేస్తోంది.
స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బంతిని ఆపే క్ర‌మంలో 15 ఏళ్ల వైభ‌వ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడటం జట్టుతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది.
కేవలం కొన్ని ప్రధాన బంకుల్లో మాత్రమే ఇంధనం లభిస్తుండటంతో, అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. తిరుమలలోని హెచ్పి పెట్రోల్ బంక్ పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.