గుండెల్ని మెలి పెడుతున్న మృతుల బంధువుల ఆవేదన

Publish Date:Jun 16, 2025

Advertisement

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాద ఘటనలో సజీవ దహనమైన వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కత్తిమీద సాములా మారింది. ప్రతి శరీర భాగానికి డీఎన్‌ఏ  టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది. మరోవైపు మాంసపు ముద్దలు ఇచ్చి.. ‘ఇవి మీ వారివే’ అని వైద్యులు చెబుతుంటే.. బంధువులు అంగీకరించలేకపోతున్నారు. ఒకట్రెండు ముక్కలు కాకుండా పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించుకుంటామంటూ వారు పడుతున్న ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది.

డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రిలోని మార్చురీ వద్ద.. మృతదేహాన్ని తీసుకొచ్చే సంచీలో రెండు తలలు ఉండటం వివాదానికి తావిచ్చింది. అప్రమత్తమైన వైద్యాధికారులు వెంటనే మరోసారి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తన కుటుంబ సభ్యుల అవశే షాలన్నీ అప్పగించమని ఓ వ్యక్తి అధికారులను వేడుకున్నారు. అయితే..  అది సాధ్యం కాదని అతి కష్టం మీద ఆయనను అధికారులు ఒప్పించారు. కష్టమని తెలిసినా.. ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధిత కుటుంబీకులు వైద్యులను ప్రాధేయపడుతున్న తీరు కన్నీరు తెప్పిస్తోంది. ఓ వైపు కుటుంబీకులను కోల్పోయామన్న బాధ.  మరోవైపు కనీసం వారి మృతదేహాలను కూడా ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నామన్న ఆవేదనతో ఆస్పత్రి ఆవరణలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది.

విమాన ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను అహ్మదాబాద్‌లోని 1200 పడకల సివిల్‌ ఆస్పత్రిలో భద్రపరిచారు. రక్తసంబంధీకుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, మృతదేహాల నమూనాలతో సరిపోల్చి.. బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది మృతుల డీఎన్‌ఏను వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు అధికారులు వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్షతో పనిలేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డీఎన్‌ఏను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

By
en-us Political News

  
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.