పిల్లల గుండెతీరు బాగుండటం లేదు!

Publish Date:May 10, 2018

Advertisement

 

పుట్టిన పిల్లలు ఇంచుమించుగా ఒకే తరహా ఆరోగ్యంతో పుడతారు. కానీ రానురానూ వారి జన్యు నిర్మాణం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. పుట్టుకతో వచ్చిన జన్యువుల ప్రభావాన్ని మన పెద్దగా నివారించలేకపోవచ్చు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలితో వారు రోగాల దిశగా వెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం! ఇవే విషయాన్ని ‘అమెరికన్‌ హార్ట్ అసోసియేషన్‌’ స్పష్టం చేస్తోంది. ఆ సంస్థ ప్రచురిస్తున్న ఒక జర్నల్‌లో నేటి పిల్లలు గుండెజబ్బులకు ఎలా సిద్ధమవుతున్నారో హెచ్చరిస్తోంది.

 

ఇదీ పరిశోధన

మినెసొటా విశ్వవిద్యాలయానికి చెందిన జూలియా స్టెయిన్‌బర్గర్ అనే పిల్లల వైద్యుని నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఇందులో భాగంగా 2007-08 సంవత్సరంలో అమెరికాలోని పిల్లల ఆహారపు అలవాట్ల గురించి చేసిన సర్వేలోని గణాంకాలన్నింటినీ పరిశీలించారు. వీటిని పిల్లల బరువు, వారి వ్యాయామపు అలవాట్లు, ఆహారం, శరీరంలో కొవ్వు శాతం, రక్తంలో చక్కెర నిల్వలు... వంటి ఏడు కొలబద్దల ఆధారంగా విశ్లేషించారు.

 

ఇదీ ఫలితం

- పిల్లల్లో దాదాపు 91 శాతం మంది సరైన ఆహారాన్ని తీసుకోవడం లేదని తేలింది. వీరి ఆహారంలో ఎక్కువగా చక్కెర అధికంగా ఉన్న పదార్థాలూ, శీతలపానీయాలే ఉన్నట్లు తేలింది.

 

- ఈ చక్కెర పదార్థాలు ఒక ఎత్తైతే.... పోషక విలువలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని దూరంగా ఉంచడం మరో ఎత్తు అంటున్నారు స్టెయిన్‌బర్గర్.

 

- ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో కూడా చాలామంది పిల్లలలో తగిన శారీరిక వ్యాయామమే ఉండటం లేదన్నది మరో ఆశ్చర్యకరమైన ఫలితం. ఇక 16 ఏళ్లు దాటిన వారిలో అయితే శారీరిక శ్రమ, వ్యాయామం అన్న లక్షణాలే కనిపించడం లేదట!

 

- టీనేజి దశలోకి చేరుకున్న అమెరికన్‌ పిల్లల్లో దాదాపు మూడోవంతు మంది పొగతాగే వ్యసనానికి లోనవుతున్నారని తేలింది.
ఇలాంటి అలవాట్లు అన్నింటివల్లా నాలుగో వంతు పిల్లలు ఊబకాయులుగా మారిపోతున్నారు; మూడోవంతు మంది పిల్లల్లో కొలెస్ట్రాల్‌ నిల్వలు అధికంగా ఉన్నాయి; టీనేజిలో ఉన్న 37% మంది మగపిల్లల్లో చక్కెర నిల్వలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఏతావాతా స్టెయిన్‌బర్గర్ బృందం పరిశీలించిన గణాంకాల ప్రకారంగా, కేవలం ఒకే ఒక్క శాతం మంది పిల్లలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్నారు!

 

ఇదీ నివారణ

పిల్లల జీవన విధానం కనుక ఇలాగే కొనసాగితే మున్ముందు వారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తీవ్రంగా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకోసం ఇప్పటికైనా మేలుకొమ్మని... మేలుకొని కొన్ని నివారణ చర్యలు మొదలుపెట్టమని సూచిస్తున్నారు. అవేమిటంటే...

 

- పిల్లల్లో సిగిరెట్‌ అలవాటు వారి ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి సిగిరెట్‌ అలవాటుని వారి దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

- వారి ఎత్తుకి తగిన బరువు ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి.

 

- పిల్లల దినచర్యలో కనీసం ఒక గంట సేపైనా శారీరిక శ్రమ ఉండేలా చర్యలు తీసుకోవాలి.

 

అన్నింటికీ మించి, ఎప్పటికప్పుడు వారికి తగిన పోషక పదార్థాలు అందేలా జాగ్రత్త పడాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు... వంటి పదార్థాల మోతాదు తగ్గిస్తూ వాటి స్థానంలో పోషక విలువలుండే సంప్రదాయ ఆహారాన్ని చేర్చాలి. లేకపోతే అమెరికన్లయినా, భారతీయులైనా అపసవ్యమైన జీవన విధానం ఎవరికైనా చేటు చేయక తప్పదు కదా!

 

- నిర్జర.

By
en-us Political News

  
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.