పచ్చగడ్డి మీద నడిస్తే... ఆరోగ్యం వస్తుందా!

Publish Date:May 30, 2016

Advertisement

మనిషి ఈ ప్రకృతిలో ఒక చిన్న భాగమే! కానీ ఈ ప్రకృతికీ తనకూ ఏమాత్రం సంబంధం లేదన్నంతగా అతని జీవనశైలి మారిపోయింది. ఒక పక్క ప్రకృతిని తనకు అనుకూలంగా ఎడాపెడా వాడేసుకుంటూనే, నాలుగ్గోడల మధ్యే జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఫలితం... కృత్రిమమైన జీవితంలాగానే, కృత్రిమమైన జబ్బులూ వచ్చేస్తున్నాయి.

 

మరే ఇతర జీవికీ లేనంతగా, మనిషి చిన్న వయసు నుంచే నానారకాల వ్యాధుల పాలిట పడుతున్నాడు. అందుకే ప్రకృతికి తిరిగి చేరువయ్యే మనిషికి ఆరోగ్యం కూడా దక్కుతుందంటూ కొత్త కొత్త పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిలో ఒకటే పచ్చగడ్డి మీద నడక! రోజురోజుకీ ప్రచారంలోకి వస్తున్న ఈ విధానం వల్ల చాలా ఉపయోగాలే ఉంటాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే...

 

- రిఫ్లెక్సాలజీ అనే శాస్త్రం ప్రకారం మన శరీరంలోని నాడులన్నీ కూడా పాదాల దగ్గరకి వచ్చి ఉంటాయి. కాబట్టి మన పాదంలోని ఒకొక్క భాగం మీద ఒత్తిడిని తీసుకువచ్చినప్పుడు, అక్కడ ఉన్న నాడికి చెందిన అవయవం మీద అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. పచ్చగడ్డిలో నడిచేటప్పుడు మన పాదంలోని ప్రతి అణువు మీదా ఒత్తిడి కలిగి తీరుతుంది కాబట్టి... రిఫ్లెక్సాలజీ ప్రకారం ఇది మన శరీరం మొత్తాన్నీ స్వస్థత పరుస్తుంది.

 

- పచ్చటి నేల మీద నడిచేటప్పుడు భూమితో ఒక అనుబంధం ఉన్న భావన కలుగుతుంది. మనం ప్రకృతి ఒడిలో ఉన్నంత తృప్తిగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి వల్ల మనసు చాలా ప్రశాంతని పొందుతుందంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంతో ఏర్పడే ఒత్తిడి, భయాందోళనలన్నీ... ఇలా ప్రకృతిలో మమేకం అవ్వడం వల్ల దూరమవుతాయంటున్నారు.

 

- నిరంతరం పాదాలకు తోలుతోనో, ప్లాస్టిక్‌తోనో చేసిన చెప్పులను ధరించడం వల్ల... మన శరీరం మీద భూమిలోని అయస్కాంత క్షేత్రం చూపించే ప్రభావంలో అనుకూల/ ప్రతికూల మార్పులు రావచ్చు. రోజులో కాసేపన్నా ఇలా గడ్డి మీద నడవడం వల్ల మన శరీరం మీద ఈ ప్రభావం సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.

 

- పచ్చగడ్డి మీద నడవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని తేలింది. ఇందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి- రిఫ్లెక్సాలజీ ప్రకారం పచ్చగడ్డి మీద నడిచేటప్పుడు, మన పాదంలో... కంటినాడి మీద ప్రభావం చూపే స్థానాల మీద ఒత్తిడి కలుగుతుంది. రెండు- నిరంతరం కంప్యూటర్ ముందో, పుస్తకం ముందో, పేపరు పట్టుకునో కూర్చునే మనకి అప్పుడప్పుడూ కాస్త దూరంగా, పచ్చగా ఉండే వస్తువులు కనిపిస్తూ ఉండాలని వైద్య శాస్త్రం చెబుతోంది.

 

- నిరంతరం బూట్లు లేదా చెప్పులు ధరించి ఉండేవారికి... అరికాళ్లలో రక్తప్రసారం తగ్గిపోయి, పాదాలు మొద్దుబారిపోయి ఉంటాయి. ఇలాంటి వాళ్లు రోజులో కాసేపన్నా పచ్చగడ్డి మీద నడిస్తే అప్పుడు తెలుస్తుంది... ఆ స్పర్శలో ఉన్న హాయి ఏమిటో. ఒక రకంగా చెప్పాలంటే పచ్చగడ్డిలో నడక మన పాదాలకు మంచి మసాజ్‌లాంటిది.

 

- ఉదయాన్నే కాసేపు అలా పచ్చగడ్డి మీద నడిస్తే ఆ తాజా గాలి, పచ్చగడ్డి మీద నుంచి వచ్చే పసిరిక వాసనా, మెత్తటి గడ్డి అందించే స్పర్శా... ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతని అందిస్తాయి. ఇక ఆ సమయంలో పై నుంచి వచ్చే సూర్యరశ్మి కూడా మనకు రోజువారీ అవసరమయ్యే విటమిన్‌ ‘డి’ను అందిస్తుంది. నేటి జీవనశైలితో వస్తున్న కీళ్ల వ్యాధి నుంచి డయాబెటిస్‌లకు ‘డి’ విటమిన్‌ లోపం కూడా ఓ కారణం అని ఇప్పటికే తేలింది. నిరంతరం నాలుగ్గోడల మధ్యే ఉంటున్న జనానికి సహజమైన ఈ విటమిన్‌ అందడం లేదని వెల్లడైంది. దీనికి ఉదయపు నడకే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతున్నారు.

 

చెప్పుకుంటూ పోతే... పచ్చగడ్డి మీద నడిస్తే వేస్తే కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఓ నాలుగడుగులు అలా వేసి చూడండి. ప్రత్యేకించి కాకపోయినా... ఎప్పుడన్నా పచ్చగడ్డి కనిపిస్తే దాని మీద పాదం మోపి చూడండి. మీరే ఒప్పుకుంటారు... ఆ స్పర్శలో ఏదో మాయ ఉందని!

- నిర్జర.

 

By
en-us Political News

  
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.