నిద్రకు ముందు దాల్చిన చెక్క, అల్లం కలిపి టీ తయారు చేసుకుని తాగితే..!

Publish Date:Jan 3, 2025

Advertisement

 


ఆరోగ్యకరమైన అలవాట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  దీని కోసం చాలామంది ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు చాలా రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తారు. వీటిలో ఉదయాన్నే వేడి నీరు తాగడం తో మొదలుపెట్టి రాత్రి పడుకునే ముందు ఏదో ఒక పానీయంతో ముగిస్తారు. రాత్రి సమయంలో చాలామంది పసుపు పాలు తాగడం,  త్రిఫల జ్యూస్,  ఉసిరి జ్యూస్ వంటివి తీసుకుంటారు. ఇవన్నీ జీర్ణశక్తికి,  రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి.  అలాంటి వాటిలో దాల్చిన చెక్క, అల్లం తో తయారు చేసిన టీ కూడా ఒకటి.  ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అల్లం, దాల్చిన చెక్క కలిపి  తయారు చేసిన టీ తాగితే ఏమవుతుందంటే..


దాల్చిన చెక్క, అల్లం రెండూ చాలా ఆహ్లాదకరమైన గుణాలు కలిగి ఉంటాయి. అవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా శరీరానికి విశ్రాంతి ఇస్తాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.  నిద్రకు ఒక 30 నిమిషాల ముందు ఈ టీని తాగడం వల్ల  రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు.


అల్లం జీర్ణశక్తికి పేరుగాంచింది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క కూడా అలాగే సహాయపడుతుంది. ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు కడుపు భారం తగ్గడానికి, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాత్రి నిద్రకు ముందు తాగితే  ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.


రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రి సమయంలో అల్లం, దాల్చిన చెక్క టీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అల్లంలోనూ, దాల్చిన చెక్కలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ప్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.


దాల్చిన చెక్క,  అల్లం కలిపి తయారు చేసిన టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.  ముఖ్యంగా దాల్చిన చెక్క మధుమేహం ఉన్నవారికి గొప్ప వరం కంటే తక్కువ కాదు.  దీన్ని రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు నియంత్రణలోనే ఉంటాయి. అంతేకాదు ఈ టీని రాత్రి సమయంలో తాగడం వల్ల రాత్రి పూట నిద్ర మధ్యలో ఆకలి వేయడం,  రాత్రి సమయంలో బయటి ఆహారాలు,  ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినాలనే కోరిక తగ్గుతుంది.


జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యతో బాధపడుతూ ఉంటే దాల్చిన చెక్క,  అల్లం కలిపి తయారు చేసిన టీ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా  శీతాకాలంలో ఈ టీని తాగడం వల్ల చాలా మంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి ఉన్నవారికి చాలా రిలాక్స్ గా ఉంటుంది.


ఇప్పటి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి చాలా చిట్కాలు పాటిస్తూ ఉంటారు.  అల్లం, దాల్చిన చెక్క రెండూ జీర్ణక్రియను వేగవంతం చేసేవే. ఈ రెండూ కలిపి తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొన్ని రోజులలోనే మార్పు తెలుస్తుంది.


                                       *రూపశ్రీ.

By
en-us Political News

  
"పిల్లలకు డిప్రెషన్ వస్తుందా?" అనే ప్రశ్నకు చాలా మంది తల్లిదండ్రుల సమాధానం "రాదు" అనే ఉంటుంది.
పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది.  ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు.
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం.
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ..
Insomnia, Insomnia Treatment, Sleep Problems, Sleep Disorder, Deep Sleep Tips, How to Sleep Better, Insomnia Causes,  Healthy Sleep, TeluguOne Health,
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి.
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.