మొలకెత్తిన ఈ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!!

Publish Date:Aug 18, 2023

Advertisement

 

నేటికాలంలో ప్రతివ్యక్తి ఏదొక వ్యాధితో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, వాపు, కొలెస్ట్రాల్ సమస్యలు ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికి కారణం మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. ఇవన్నీ కూడా రకరకాల వ్యాధులకు గురిచేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువే ఉంది. అంతేకాదు మధుమేహం నేటికాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే వీటన్నింటిని నుండి విముక్తి పొందాలంటే మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా చాలా మంది మొలకెత్తిన గింజలు తింటుంటారు. అందులో ప్రొటిన్, కార్బోహైడ్రెట్స్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మీకో అద్భుతమైన హోం రెమెడీని పరిచయం చేస్తాం. ఈ మొలకలను నిరంతరం మీ డైట్లో చేర్చుకున్నట్లయితే  ఎనిమిది రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అవేంటో చూద్దాం.


నానబెట్టిన మెంతిగింజలు:


నానబెట్టిన మెంతి గింజలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అల్పాహారంలో మొలకెత్తిన మెంతిగింజలను తప్పకుండా తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  50 ఏళ్ల తర్వాత ఇది చాలా ముఖ్యమైన అల్పాహారం. ఎందుకంటే ఇందులో అనేక పోషక అంశాలు ఉంటాయి. ఒక టీస్పూన్ మెంతి గింజల్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్,  డయాబెటిస్ తగ్గిచడంతోపాటు.. జీవక్రియను వేగవంతం చేస్తుంది.

మెంతి గింజల ప్రయోజనాలు:


రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
అధిక రక్తపోటును తగ్గిస్తుంది
విటమిన్, ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది.
బాలింతల బలహీనతను తొలగిస్తుంది
జుట్టు, గోర్లు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
అధిక రక్త చక్కెరను నియంత్రిస్తుంది.
ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తుంది.

మీ మెదడును మెరుగుపరచడానికి మీరు అల్పాహారంగా మెంతి గింజలను నువ్వులతో కలిపి తినవచ్చు. మెంతి గింజలు, జీలకర్రను రాత్రంతా నానబెట్టండి. ఉదయం మొలకెత్తిన ఖాళీ కడుపుతో తినండి. చక్కటి ఫలితం ఉంటుంది.

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.