అమెరికా, ఇరాన్ వార్ కు ఎండ్ కార్డ్ పడిందా?

Publish Date:May 25, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత మూడు నెలలుగా కొనసాగుతున్న   సైనిక, దౌత్యపరమైన ఉద్రిక్తతలు  ఒక ముగింపునకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చలు సఫలమైతే, ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఈ ఘర్షణ వాతావరణం శాంతి ఒప్పందంతో ముగిసే అవకాశం ఉంది. ఈ తాజా శాంతి ప్రతిపాదనల్లో భాగంగా రెండు దేశాలు కీలక నిబంధనలకు అంగీకరించేలా ఒక ముసాయిదా అవగాహన ఒప్పందం  సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఈ ఒప్పందంలోని ప్రాథమిక నిబంధనల ప్రకారం.. ఇరుపక్షాలు 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు  అంగీకరించనున్నాయి. ఈ సమయంలో అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన  స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'  జలమార్గం తిరిగి పూర్వస్థితికి చేరుకుంటుంది. ఇరాన్ ఈ జలమార్గంలో అమర్చిన సముద్రపు మైన్లను తొలగించడంతో పాటు... వాణిజ్య నౌకల నుంచి ఎలాంటి టోల్ వసూలు చేయకుండా ఉచిత రవాణాకు అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా  అమెరికా ఇరాన్ రేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడమే కాకుండా...  60 రోజుల పాటు ఇరాన్ స్వేచ్ఛగా చమురు విక్రయించుకునేలా ప  ఆంక్షల సడలింపులను ప్రకటించనుంది.

ఈ శాంతి చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం అత్యంత కీలకమైన అంశంగా మారింది. అమెరికా చిరకాల డిమాండ్‌కు తలొగ్గి, ఇరాన్ తన వద్ద ఉన్న  శుద్ధి చేసిన  యురేనియం నిల్వలను  వదులుకోవడానికి ప్రాథమికంగా అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం శనివారం (మే 23) నాటి తన ప్రకటనలో ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని సంకేతాలు ఇచ్చారు. అయితే..  గతంలోనూ పలుమార్లు చర్చలు చివరి దశకు వచ్చి విఫలమవడంతో, ఇరు దేశాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సి ఉంటుంది.

గడిచిన మూడు నెలల యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన, సహజ వాయువు ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా జరిగే రవాణా నిలిచిపోవడంతో మార్కెట్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతానికి చర్చలు సజావుగా సాగుతూ హార్ముజ్ జలమార్గం తాత్కాలికంగా తెరుచుకున్నప్పటికీ, రాబోయే తుది చర్చల ఫలితాన్ని బట్టే ఈ యుద్ధానికి శాశ్వత ముగింపు దక్కుతుందా లేదా అనేది తేలనుంది. 

By
en-us Political News

  
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలమేరకు.. ఈ ధరల రాయితీ లేదా కుషన్ కేవలం సామాన్య రిటైల్ వినియోగదారుల కోసమే ఉద్దేశించబడింది. నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 97 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కేవలం మూడు పరుగుల తేడాతో తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
ప్రతి ఏటా మే 28న వచ్చే ఈ పవిత్రమైన రోజున నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవాన్ని స్మరించుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను రంగురంగుల పువ్వులతో, పచ్చటి ఆకులతో సుందరంగా అలంకరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.