అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ కాంగ్రెస్’కు ఎదురుదెబ్బ.. హర్థిక్ పటేల్ గుడ్ బై

Publish Date:May 18, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్’లోని ఉదయపూర్ మూడు రోజుల రోజుల పాటు, నవ సంకల్ప చింతన్ శిబిర్ ‘ నిర్వహించి, మరో మూడు రోజులు అయినా గడవ లేదు, కానీ ఇంతలోనే, పిడుగు లాంటి వార్త ... గుజరాత్’ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్, కాంగ్రెస్ పార్టీకీ, పార్టీ పదవికి రాజీనామా చేశారు. నిజమే, హార్దిక్ పటేల్ రాజీనామా నిజానికి అంత పిడుగులాంటి వార్త కాదు, ఎందుకంటే, గడచిన మూడు సంవత్సరాలలో హర్థిక్ పటేల్ కంటే పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న, జ్యోతిరాదిత్య సిందియా వంటి అనేక మంది నాయకులు క్యూకట్టి పార్టీని వదిలి పోయారు. పోతూనే ఉన్నారు. అయినా, చింతన శిబిరంలో కానీ, అంతకు ముందు ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కానీ, పార్టీతో తరతరాల అనుబంధం ఉన్న నాయకులు, ఎందుకు పార్టీ వదిలి పోతున్నారు? అనే కోణంలో కొద్దిపాటి చర్చకూడా జరగలేదు. అంతేకాదు, పోయే వాళ్ళంతా పోండని’ స్వయంగా రాహుల్ గాంధీనే తలుపులు తెరిచారు. 

అదొకటి అలాఉంటే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీని వదిలి పోవడం ఖాయమని, గుజరాత్ రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. నిజానికి, చింతన్ శిబిర్’ జరుగతున్న సమయంలోనే హార్దిక్ పటేల్ ఒక టీవీ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో , రాష్ట్రంలో మరో ఆరు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించనే లేదని తీవ్ర విమర్శలు చేశారు. చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితి వివరిస్తానని, అప్పటికీ పార్టీ నాయకత్వంలో కదలిక రాక పొతే, పార్టీ వదిలి పోవడం మినహా మరో మార్గం లేదని చెప్పారు. ఆ తర్వాత, ఆయన సొనియా, రాహుల్ గాంధీలను కలిశారో లేదో కానీ, పార్టీకి అయితే రాజీనామా చేశారు. 

అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పాటీదార్ ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన హర్థిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేయడం, కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిలో, హర్థిక్ పటేల్ స్థాయి నాయకుడు పార్టీని వదిలి పోవడం, గట్టి ఎదురు దెబ్  అనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. నిజానికి, 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి అంచుల వరకు తీసుకుపోయిన ఖ్యాతి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కంటే, హార్దిక్ పటేల్ కే దక్కుతుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ, అతి కష్టం మీద బయట పడింది. ఒకటి రెండు సీట్ల స్వల్ప మెజారిటీతో, అధికారాన్ని నిలుపుకుంది.

ఇందుకు ప్రధాన కారణం, హర్థిక్ పటేల్ నాయకత్వంలో  కొనసాగిన పాటీదార్ ఉద్యమం. గుజరాత్‌లో రాజకీయంగా ఎక్కువ ప్రభావం ఉన్న పాటీదార్ వర్గానికి నేత అయిన హర్దిక్ పటేల్.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో తన మద్దతు కాంగ్రెస్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయింది కానీ.. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి మోడీ దేశ ప్రధాని అయ్యాక జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అంచనాలను తారుమారు చేస్తూ, స్వల్ప మెజారిటీతో బీజేపీ గట్టెక్కింది.ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే,పార్టీ ఆయనకు సముచిత స్థానం ఇవ్వక పోవడంతో ఎప్పటినుంచో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన చివరాఖరుకు, పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాజీనామ చేశారు. ఈమధ్య కాలంలో ఆయన బీజేపీని, బీజేపీ నాయకత్వాని మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలను బట్టియా ఆయన బహుసా బీజేపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోందని అంటున్నారు.  

అదలా ఉంటే. హార్దిక్ పటేల్ రాజీనామాపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ‘అనధికార’ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ పై నమ్మకం లేకనే హార్దిక్ రాజీనామా చేశారని ఒవైసీ అన్నారు. నిజం, అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి  హిమంత బిశ్వశర్మమొదలు హార్దిక్ పటేల్ వరకు అనేక మంది సమర్ధులైన యువనాయకులు కాంగ్రెస్ పార్టీని వదలి బీజేపీగూటికి చేరడానికి,రాహుల్ గాంధీ ఇండిఫ్ఫెరెంట్’ యాటిట్యూడే’ కారణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు, జీ 23 నాయకులు ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు.

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.