అగ్గిపెట్టె మచ్చా నోటికొచ్చిన లెక్కలు!

Publish Date:Jul 27, 2024

Advertisement

తెలంగాణలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వుండగా ఏం చేసేవారంటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణని అద్భుతంగా పరిపాలించేది. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు...  వీళ్ళ నుంచి వందలమంది పుట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళు తెలంగాణ మొత్తం తిరుగుతూ వుండేవాళ్ళు. ఎక్కడ ఏ నేరం జరగబోతున్నా ఆ నేరాన్ని జరక్కుండా ఆపేవాళ్ళు. అలాగే ఇంత గొప్ప పాలనలో పోలీసులు కూడా అద్భుతంగా పనిచేసేవాళ్ళు రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ ఒక్కో పోలీసు వుండేవాడు. పోలీసులు జరుగుతున్న నేరాలను ఆపడం మాత్రమే కాదు... జరగబోయే నేరాలను కూడా పసిగట్టేసి ఆపేసేవాళ్ళు. ఆపడానికి పోలీసుల వల్ల కూడా కాని నేరాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు సూపర్ మ్యాన్, స్పైడర్ మాన్ తరహాలో క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమైపోయి వాటిని ఆపేసేవారు. దాంతో కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో నేరాలే జరిగేవి కావు. కానీ, గత ఎనిమిది నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడంతో తెలంగాణలో ఎక్కడ చూసినా నేరాలే నేరాలు.. నేరాల మీద నేరాలు.. ఈ సోది అంతా ఏంటి అనుకుంటున్నారా? తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి మీద బీఆర్ఎస్ నాయకుడు, అగ్గిపెట్టె మచ్చా హరీష్ రావు మాట్లాడుతున్న తీరు కూడా ఇలాగే వుంది మరి!

బీఆర్ఎస్ లాంటి గొప్ప పార్టీ అధికారంలో లేకపోవడంతో ఈ ఎనిమిది నెలల కాలంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోయిందట. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా అని, నేరస్తులు రెచ్చిపోయి నేరాలు చేసేస్తున్నారట. కేవలం ఈ ఎనిమిది నెలల కాలంలోనే రాష్ట్రంలో లక్ష కంటే ఎక్కువ నేరాలు జరిగాయట. వాటిలో 5 వందలు హత్యలు, 1800 రేప్‌లు, 60 డెకాయిటీస్, 400 రాబరీలు, 10 వేల దొంగతనాలు వున్నాయట. కాబట్టి, ఈ అగ్గిపెట్టె మచ్చా ఉద్దేశమేంటి? అర్జెంటుగా తమ పార్టీకి అధికారం ఇచ్చేస్తే, కేసీఆర్ అండ్ కో తెలంగాణలో నేరాలేవీ జరక్కుండా చూస్తారు. అదీ విషయం.

బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట ఎవడో హరీష్‌రావు లాంటివాడే. అసెంబ్లీ సాక్షిగా ఆయన పోలిగాడి కంటే దారుణమైన అబద్ధాలు చెబుతున్నారు. ఉదాహరణకి 80 రోజుల్లో 1800 రేప్‌లు జరిగాయని ఆయన సెలవిస్తున్నారు. అంటే రోజుకు 20కి పైగానే మానభంగాలు జరుగుతున్నట్టు ఆయన చెబుతున్నారు. నా నోటికొచ్చింది నేను చెప్తా మీ చావు మీరు చావండి. నా చేతికొచ్చిన బురద మీ మీద జల్లుగా కడుక్కుంటారో చస్తారో మీ ఇష్టం. మాకు మాత్రం అర్జెంటుగా అధికారం కావాలి అన్నట్టుగా వుంది హరీష్ రావు వ్యవహారం. 

తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వ్యవహారం ఒకేలా వున్నాయి. చవటాయని నేను అని ఒకళ్ళు అంటే, నీకంటే పెద్ద చవటాయని నేను అని మరొకరు అంటున్నారు. జగనేమో ఢిల్లీ వెళ్ళి 36 హత్యలు జరిగాయని మొత్తుకున్నాడు. ఆ హత్యకు గురైనవాళ్ళ పేర్లు చెప్పవయ్యా మగడా అని మీడియావాళ్ళు, హోంమంత్రి, ముఖ్యమంత్రి అడుగుతుంటే ‘టాపిక్ డైవర్ట్ చేయొద్దు’, నేను ఇచ్చిన ఫొటోలు చూసి తెలుసుకోండి అని చెబుతున్నాడు. నా నోటికి వచ్చింది నేను చెబుతా, మీరు విని ఊరుకోండి.. ఎదురు ప్రశ్నలు వేయొద్దు అంటున్నాడు. తెలంగాణలో కేసీఆర్ అండ్ కో, ఆంధ్రలో జగన్ అండ్ కో ఇలాంటి నీచమైన రాజకీయాలు చేశారు కాబట్టే వీళ్ళని జనం పక్కన పెట్టారు. అయినప్పటికీ వీళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. 

By
en-us Political News

  
కుండ‌పోత వ‌ర్షానికితోడు బుడ‌మేరు వ‌ర‌ద నీరు విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ముంచెత్తడంతో ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించ‌డంలో నిమ‌గ్న‌మైంది. తెలుగు రాష్ట్రాల్లోని మీడియా మొత్తం విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల‌పైనే ఫోక‌స్ పెట్టింది. గ‌త ఏడు రోజులుగా ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు.. అధికార ప‌క్షం ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న స‌హాయంపైనే ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 8) ఉదయం తిరుమలేశుని దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
జగన్ హయాంలో ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అరాచకం తాండవించింది. దాడులకు, దౌర్జన్యాలకూ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తప్పులు చేసిన వారిపై చర్యలు లేవు.అకృత్యాలకూ, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడిన వారిపై కేసులు లేవు, ,చర్యలు లేవు సరికదా ఎదురు బాధితులే వేధింపులకు గురైన పరిస్థతి.
కృష్ణానది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా వరద వచ్చింది. చరిత్రలోనే తొలిసారిగా గతంలో ఎన్నడూలేని విదంగా 12 లక్షల క్యూసెక్కుల వదర ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. ఆ సమయంలో అంటే ఈ నెల 1న భారీ మరపడవలు ఆ వరద ప్రవాహంలో వచ్చి ప్రకాశం బ్యారేసీ గేట్లను బలంగా ఢీ కొన్నాయి. బ్యారేజీ నుంచి దిగువకు నీరు వెళ్లే మార్గంలో అడ్డంగా చిక్కుకున్నాయి. దీంతో వరద ప్రవాహం దిగువకు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడింది. బ్యారేజీకి కూడా నష్టం వాటిల్లింది.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం (సెప్టెంబర్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు.
ఆయనో రాజ‌కీయ చాణుక్యుడు.. ఆర్థిక వేత్త‌.. ఐటీ రంగ నిపుణుడు.. టెక్నాల‌జీకి బ్రాండ్ అంబాసిడర్.. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆప‌ద్భాంద‌వుడు.. క‌ష్ట‌ కాలంలో అండ‌గా నిలిచే పెద్ద‌న్న‌.. మొత్తంగా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి.. ప్రజా నాయకుడు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ ప్ర‌జ‌ల క్షేమం కోసం ఎంత‌దూర‌మైనా వెళ్లే జననేత.
గణపతి నవరాత్రి వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌య్యారు. ప‌ట్ట‌ణం, ప‌ల్లెల్లో వాడ‌వాడ‌లా గ‌ణ‌నాథుడి మండ‌పాలు ఏర్పాటు చేశారు. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ప్ర‌తీ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు.
తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోందా? పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది.
తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదవికి మరో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ పోటీ పడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇకనుంచి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తారని ఎఐసిసి పేర్కొంది.
తోడేళ్లు పగబడతాయా? ప్రతీకారం తీర్చుకుంటాయా? కక్షగట్టి వెంటాడి, వేటాడి మరీ ఉసురు తీస్తాయా? అంటే ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో జరుగుతున్న వరస సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ ఔననే అంటున్నారు అటవీ శాఖ అధికారులు.
భారీ వర్షాల వల్ల ఎపి అతలాకుతలమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉన్నారు. నిన్న బుడమేరు వాగు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రికి  తృటిలో రైలు ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.  
తెలంగాణలో బీజేపీలో కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కృత నిశ్చయానికి ఆ పార్టీ హైకమాండ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యం అంటూ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న కొన్ని చర్యలు, నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. దీంతో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనుకున్నంతగా పెర్ఫార్మ్ చేయలేక చతికిల పడింది.
మన భారతీయ న్యాయ వ్యవస్థ చలా గొప్పది. అపరాధులను వదిలిపెట్టదు. నిర్దోషులను శిక్షించదు. న్యాయం విషయంలో తన, పర భేదం చూపించదు. ఇంత గొప్ప న్యాయ వ్యవస్థ వున్న దేశంలో మనం పుట్టినందుకు ఎంతో గర్వించాలి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.