రైతు బంధుకు ఈసీ బ్రేక్.. హరీష్ రావు అత్యుత్సాహమే కారణం!

Publish Date:Nov 27, 2023

Advertisement

క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు. అలాగే ఎన్నికల రణరంగంలో కూడా  మాటలే ఒక్కోసారి పార్టలకు గెలుపుబాట చూపుతాయి. క్రికెట్ లో ఎలాగైతే ఓ క్యాచ్ మిస్ చేస్తే ఫలితం తారుమారైపోతుందో.. ఎన్నికలలో కూడా ఒక తొందరపాటు మాట, ఒక అనుచిత వ్యాఖ్య, ఒక పొల్లు మాట గెలుపును దూరం చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ అయాచితంగా ఇచ్చిన ఒక అవకాశాన్ని తన తొందరపాటు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ చేజార్జుకుని, కీలకమైన క్యాచ్ వదిలేసిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

ఎన్నికలో కోడ్ ఉన్న సమయంలో నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రచారం హడావుడిలో మాట తూలినా, తొందరపాటు ప్రదర్శించినా నష్టం తప్పదు. 
రైతు బంధుకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల కిందట అనుమతి ఇవ్వడం నిస్సందేహంగా బీఆర్ఎస్ కు జీవన్ టోన్ టానిక్ లా పని చేసింది. అప్పటి వరకూ హోరాహోరీ పోరులో వెనకబడతామేమో అన్న సందేహం బయటకు చెప్పకపోయినా, బీఆర్ఎస్ కీలక నేతలు సహా శ్రేణులలోనూ వ్యక్తం అవుతూనే ఉంది. అటువంటి వేళ.. రైతు బంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చి బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసింది. ఎన్నికల సంఘం అనుమతిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అసమ్మతి వ్యక్తం చేశాయి. విమర్శలు గుప్పించాయి. అయినా పాత పథకమే, అమలులో ఉన్న పథకమే అంటూ ఎన్నికల సంఘం రైతు బంధు లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు జమ చేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు కొండంత బలం వచ్చినట్లైంది. అయితే అనుమతి ఇచ్చిన రెండు రోజులలోనే ఆ ఆనందం, ఆ బలం ఆవిరైపోయేలా ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. అయితే ఇందుకు కారణం విపక్షాల విమర్శలో, అభ్యంతరాలో కాదు. బీఆర్ఎస్ నేతల తొందరపాటు వ్యాఖ్యలు. బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం. అదే ఇప్పుడు ఆ పార్టీ తలలు కొట్టుకునేలా చేసింది. అరెరె.. మంచి చాన్స్ చేజేతులా వదులుకున్నామే అని మధన పడేలా చేసింది. 

ఇంతకూ జరిగిందేమిటంటే.. కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు లబ్ధిదారులకు నిధుల పంపిణీకి అనుమతి ఇస్తూ ఆ పంపిణీని మంగళవారం(నవంబర్ 28) లోగా ముగిచేయాలని ఆదేశించింది. అయితే సోమవారం (నవంబర్ 27) కార్తీకపౌర్ణమి సందర్భంగా సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో రైతు బంధు సొమ్ముల పంపిణీకి మంగళవారం ఒక్క రోజే గడువు ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ రైతు బంధు పంపిణీపై ఎన్నికల నియమాళిని ఉల్లంఘించే విధంగా మాట్లాడారు. ఔను ఈ పథకం కింద రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతున్న విషయాన్ని ఆయన గొప్పగా, ఘనంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చాటుకున్నారు. ఎన్నికల ముంగిట ఓటర్లు ప్రలోభాలకు లోనయ్యే విధంగా ఫలానా తేదీన, ఫలానా సమయానికి ఖాతాలలో సొమ్ములు జమ చేస్తున్నామనీ, లబ్ధిదారుల ఫోన్లకు అందుకు సంబంధించి మెసేజీలు టంగు టంగు మంటూ వస్తాయనీ చాటారు. దీనినే కేంద్ర ఎన్నికల సంఘం తప్పపట్టింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడమే కాకుండా.. రైతు బంధు నిధుల పంపిణీని ఆపేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటూ రైతు బంధుపథకం నిధుల పంపిణీపై ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ రైతు బంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.  

రైతు రుణమాఫీ, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతుబంధుకు అనుమతి వంటి అంశాలలో బీఆర్ఎస్ సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది. ఎన్నికల కోడ్ కారణంగా అమలులో ఉన్న పథకాలను నిలిపివేయాలనడం సరికాదని ఆ లేఖలలో పేర్కొంది. అయితే ఆ లేఖలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం  రుణమాఫీ అమలు, ఉద్యోగులకు డీఏల విడుదలకు ససేమిరా అంటూ..   రైతుబంధు పథకం అమలుకు ఓకే చెబుతూ, ఆ పథకం అమలును మంగళవారం(నవంబర్ 28 ) లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.  ఈ తరుణంలో హరీష్ రావు కోడ్ ను ఉల్లంఘించేలా రైతు బంధు నిధులపై చేసిన వ్యాఖ్యలతో మొదటికే మోసం వచ్చినట్లైంది. దీనిపై  బీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. అయితే బీఆర్ఎస్ లో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీవ్ర నిరాశను నింపిందన్నది మాత్రం వాస్తవం. 

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.