Publish Date:Apr 28, 2025
కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ హరిరాంను గజ్వేల్ లో శనివారం (ఏప్రిల్ 26)అరెస్టు చేసింది. ఈ సందర్భంగా హరిరాం విలాసవతంతమైన ఆస్తుల జాబితా విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే..
షేక్‌పేటలో లగ్జరీ విల్లా, కొండాపూర్‌లో లగ్జరీ విల్లా, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్, మాదాపూర్‌లో ఫ్లాట్, నార్సింగిలో ఫ్లాట్, అమరావతిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండివిడ్యువల్ హౌసెస్, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో మామిడి తోటతో కూడుకున్న ఫామ్ హౌస్. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి, కుత్బుల్లా పూర్ లో ఓపెన్ ప్లాట్, మిర్యాలగూడలో మరో ఓపెన్ ప్లాట్, ఒక బీఎండబల్యూ కారుతో సహా.. 2 ఇతర వామనాలు తమ సోదాల్లో వెలుగులోకి తీశారు అధికారులు. ఇంకా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లతో కలుపుకుని సుమారు ఈ అక్రమాస్తుల విలువ వంద కోట్ల మేర ఉండొచ్చని అంచనా.
హరిరాంను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు అధికారులు. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం నిర్వహణలో తీవ్రమైన లోపాలను బయట పెట్టింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నివేదిక విడుదలైన కాసేపటికే ఇది జరగడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harirao-illegal-assets-above-100-crores-25-197076.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.